ముగిసిన CLP Meetting: సీఎల్పీనేత ఎంపిక బాధ్యత మల్లికార్జున ఖర్గేకు అప్పగింత

Published : Dec 04, 2023, 12:57 PM ISTUpdated : Dec 04, 2023, 01:32 PM IST
ముగిసిన CLP Meetting: సీఎల్పీనేత ఎంపిక బాధ్యత మల్లికార్జున ఖర్గేకు అప్పగింత

సారాంశం

సీఎల్పీ సమావేశం ముగిసింది. సీఎల్పీ నేత ఎంపిక కోసం ఎమ్మెల్యేలతో  సంప్రదింపులు జరిపారు పార్టీ పరిశీలకులు


హైదరాబాద్: సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అప్పగించినట్టుగా  కాంగ్రెస్ పరిశీలకుడు  కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెప్పారు.

సీఎల్పీ సమావేశంలో  తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు  అనుముల రేవంత్ రెడ్డి తీర్మానం ప్రవేశ పెట్టారు.ఈ తీర్మానాన్నిరేవంత్ రెడ్డి  ప్రతిపాదించగానే  పలువురు కాంగ్రెస్ నేతలు  ఈ తీర్మానాన్ని బలపర్చారు.  ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క,కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఆది శ్రీనివాస్, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ తదితరులు ఈ తీర్మానాన్ని బలపర్చారు.

ఈ తీర్మానంపై  కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రెండు గంటల్లో నిర్ణయాన్ని ప్రకటించనుంది.ఇదిలా ఉంటే తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన   కాంగ్రెస్ నేతలకు  ధన్యవాదాలు తెలుపుతూ మరో తీర్మానం చేసింది కాంగ్రెస్ పార్టీ. మరో వైపు  తెలంగాణలో  కాంగ్రెస్ కు  పట్టం కట్టిన  తెలంగాణ ప్రజలకు  కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ధన్యవాదాలు తెలుపుతూ  తీర్మానం చేసింది.

also read:CLP Meeting..ప్రారంభమైన సీఎల్పీ భేటీ: సీఎల్పీ నేత ఎంపికపై అభిప్రాయ సేకరణ

సీఎల్పీ సమావేశానికి పరిశీలకులుగా వచ్చిన  నేతలు  ఎమ్మెల్యేలతో విడివిడిగా  అభిప్రాయాలను సేకరించనున్నారు.  సీఎల్పీ నేతగా ఎవరుంటే పార్టీకి ప్రయోజనం కలుగుతుందనే విషయమై  ఎమ్మెల్యేల నుండి అభిప్రాయాలను సేకరించనున్నారు.ఈ అభిప్రాయాలను కూడ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి  పార్టీ పరిశీలకులు పంపనున్నారు.

also read:Errabelli dayakar Rao..డబుల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యేను ఓడించిన యశస్విని: ఎవరీ యశస్విని రెడ్డి

సీఎం పదవి విషయమై  రేవంత్ రెడ్డితో పాటు ఎన్ . ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క  కూడ సీరియస్ ఆశిస్తున్నారు.  దీంతో  సీఎల్పీ సమావేశానికి ముందే  కర్ణాటక డిప్యూటీ సీఎం  డీకే శివకుమార్ తో  ఉత్తమ్ కుమార్ రెడ్డి,  దామోదర రాజనర్సింహ,  మల్లు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి  రాజగోపాల్ రెడ్డి భేటీ అయ్యారు.ఈ భేటీ ముగిసిన తర్వాత  సీఎల్పీ సమావేశానికి డికే శివకుమార్ సహా  నేతలు హాజరయ్యారు.తెలంగాణ ఏర్పాటు తర్వాత రెండు దఫాలు కాంగ్రెస్ పార్టీ  అధికారానికి దూరమైంది. మూడో దఫా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రావడానికి అనేక అంశాలు కలిసి వచ్చాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana: గొప్ప మ‌న‌సు చాటుకున్న సీఎం రేవంత్‌.. రూ. 12 లక్ష‌ల ఆర్థిక సాయం
weather alert: మ‌ళ్లీ వ‌ర్షాలు.. తెలుగు రాష్ట్రాలకు వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు