Transco, genco cmd prabhakar rao:ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు రాజీనామా

By narsimha lode  |  First Published Dec 4, 2023, 12:50 PM IST


ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు  సోమవారంనాడు తన పదవికి రాజీనామా సమర్పించారు. 



హైదరాబాద్: ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు  సోమవారంనాడు తన పదవికి రాజీనామా సమర్పించారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామాను సమర్పిస్తున్నట్టుగా ప్రభాకర్ రావు ప్రకటించారు.  తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి  ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ గా ప్రభాకర్ రావు కొనసాగుతున్నారు.  తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు దిశగా  చర్యలు సాగుతున్న తరుణంలో ప్రభాకర్ రావు రాజీనామాను సమర్పించారు.
 మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఉన్న కేవీ రమణచారి కూడ తన పదవికి రాజీనామా సమర్పించారు. 

also read:D.K. Shiva Kumar తో ఉత్తమ్, మల్లు భట్టి.. కోమటిరెడ్డి భేటీ: సీఎల్పీ భేటికి ముందే కీలక సమావేశం

Latest Videos

undefined

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి వ్యసాయంతో పాటు  విద్యుత్ కోతలు లేకుండా చేయడంలో  ప్రభాకర్ రావు కీలకంగా వ్యవహరించారు.  రిటైర్డ్ ఉద్యోగిగా ఉన్న ప్రభాకర్ రావును  కేసీఆర్  ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీగా నియమించారు.  ఎన్నికలకు కొన్ని రోజుల ముందు  కొందరు ఐఎఎస్ అధికారులపై  ప్రభాకర్ రావు విమర్శలు చేశారు.  విద్యుత్ శాఖకు  ప్రభుత్వం నుండి నిధులు రాకుండా  కొందరు  ఐఎఎస్ అధికారులు అడ్డుకుంటున్నారని కూడ ఆయన విమర్శలు చేశారు. 

also read:Errabelli dayakar Rao..డబుల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యేను ఓడించిన యశస్విని: ఎవరీ యశస్విని రెడ్డి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  పలువురు ముఖ్యమంత్రుల వద్ద కీలక శాఖల్లో పనిచేసిన  కేవీ రమణాచారి వీఆర్ఎస్ తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత  కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా  కేవీ రమణాచారిని తీసుకున్నారు.

also read:Telangana Election results 2023: పార్టీ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలు ఓటమి

రెండు దఫాలుగా  కేవీ రమణాచారికి  ఈ బాధ్యతలను కేసీఆర్ అప్పగించారు. తెలంగాణలో భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం  అధికారాన్ని కోల్పోయింది. ప్రభాకర్ రావు, కేవీ రమణాచారిలు తమ పదవులకు రాజీనామా చేశారు. రానున్న రోజుల్లో ఇతర  సలహదారులు కూడ  రాజీనామాలు సమర్పించే అవకాశం లేకపోలేదు.

  

click me!