Election Commission: డీజీపీ అంజనీ కుమార్‌పై సస్పెన్షన్ వేటు..: ఈసీ ఆదేశాలు.. తర్వాత ఎవరు అంటే?

By Mahesh KFirst Published Dec 3, 2023, 5:44 PM IST
Highlights

డీజీపీ అంజనీ కుమార్ పై ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందునే అంజనీ కుమార్‌ను సస్పెండ్ చేసిందని, మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులు సంజయ్ కుమార్ జైన్, మహేశ్ భాగవత్‌లకు షో కాజ్ నోటీసులు పంపింది.
 

హైదరాబాద్: డీజీపీ అంజనీ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఆయనతోపాటు మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులకు షో కాజ్ నోటీసులు పంపింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందునే ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో రేవంత్ రెడ్డి నివాసానికి డీజీపీ అంజనీ కుమార్, మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులు సంజయ్ కుమార్ జైన్, మహేశ్ భాగవత్‌లు వెళ్ళారు. రేవంత్ రెడ్డిని కలిశారు. వారిని అభినందించారు. అనంతరం ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్ల గురించి డీజీపీ అంజనీ కుమార్ రేవంత్ రెడ్డిని అడిగారు. ఆ తర్వాత డీజీపీ అంజనీ కుమార్ ఇందుకు సంబంధించి ఓ సమావేశాన్ని కూడా నిర్వహించారు. ఇంతలోనే ఎన్నికల సంఘం డీజీపీపై సస్పెన్షన్ వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక సంజయ్ కుమార్ జైన్, మహేశ్ భాగవత్‌లకు షో కాజ్ నోటీసులు పంపింది. 

Latest Videos

Also Read: Telangana Election Results 2023: ఒకే కుటుంబం నుంచి గెలిచిన వాళ్లు వీరే.. ఫ్యామిలీ పాలిటిక్స్ మామూలుగా లేవుగా

ఎన్నికల కోడ్ ఉండగానే.. ఎన్నికల పై స్పష్టమైన అంచనా వెలువడక ముందే వీరు అత్యుత్సాహంతో రేవంత్ రెడ్డిని ఇంటికి వెళ్లి కలిసినట్టుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.

Also Read: బండి సంజయ్ ఓటమి.. రీకౌంటింగ్‌కు డిమాండ్.. లైవ్ అప్‌డేట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అదే విధంగా ఈసీ మరో కీలక నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు. రేపే ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండటంత, డిసెంబర్ 9వ తేదీ వరకు భారీ బందోబస్తు నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో డీజీపీ అంజనీ కుమార్ సస్పెండ్ కావడం సంచలనంగా మారింది. దీంతో డీజీపీగా అంజనీ కుమార్ తర్వాత సీనియర్ మోస్ట్, అర్హులైన అధికారిని డీజీపీగా ఎంచుకోవాలని చీఫ్ సెక్రెటరీకి ఈసీ ఆదేశించింది. ఈ ఆదేశాలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

click me!