vijayashanthi:మల్లికార్జున ఖర్గేతో విజయశాంతి భేటీ, కాంగ్రెస్‌లో చేరిన రాములమ్మ

By narsimha lode  |  First Published Nov 17, 2023, 5:20 PM IST


 బీజేపీకి గుడ్ బై చెప్పిన సినీ నటి  విజయశాంతి  కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని  ప్రచారం సాగుతుంది.ఈ ప్రచారానికి ఊతమిచ్చేలా  విజయశాంతి అడుగులు వేస్తున్నారు.
 


హైదరాబాద్: భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసిన  ప్రముఖ సినీ నటి  విజయశాంతి శుక్రవారం నాడు  అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు  మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైద్రాబాద్ లో భేటీ అయ్యారు.  బీజేపీకి విజయశాంతి  రాజీనామా చేసిన విషయం తెలిసిందే.  కమలం పార్టీ తీరుపై అసంతృప్తితో ఉన్న  విజయశాంతి  ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు.

ఈ నెల  15వ తేదీన భారతీయ జనతా పార్టీకి విజయశాంతి రాజీనామా చేశారు.  కాంగ్రెస్ పార్టీలో చేరే విషయమై మల్లికార్జున ఖర్గేతో  విజయశాంతి చర్చిస్తున్నట్టుగా  పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీలో గతంలో రహస్య సమావేశాలు నిర్వహించిన నేతల్లో విజయశాంతి కూడ ఉన్నారు. బీజేపీలోని పరిణామాలపై కొందరు నేతలు అసంతృప్తితో ఉన్నారు.

Latest Videos

undefined

also read:vijayashanthi:మల్లికార్జున ఖర్గేతో విజయశాంతి భేటీ, కాంగ్రెస్‌లో చేరిన రాములమ్మ

దీంతో  ఈ పరిణామాలపై  రహస్యంగా సమావేశాలు నిర్వహించి  చర్చించారు. వీరంతా  పార్టీని వీడుతారనే  ప్రచారం కూడ సాగింది.ఈ ప్రచారానికి తగినట్టుగానే ఒక్కొక్కరుగా  నేతలు పార్టీని వీడుతున్నారు.  తొలుత  మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  బీజేపీకి గుడ్ బై చెప్పారు. గత నెలలో  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ నెలలో  మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి  బీజేపీని వీడారు.  కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. రెండు రోజుల క్రితం  విజయశాంతి బీజేపీకి గుడ్ బై చెప్పారు. ఇవాళ ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు..

also read:Telangana Congress Election manifesto: ఏటా 2 లక్షల ఉద్యోగాల భర్తీ, ఆరోగ్యశ్రీ పరిమితి రూ. 10 లక్షలకు పెంపు

గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న విజయశాంతి  ఆ పార్టీ నాయకత్వ తీరుపై అసంతృప్తితో  హస్తం పార్టీకి గుడ్ బై చెప్పి భారతీయ జనతా పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్రంలో  బీఆర్ఎస్ ను ఎదుర్కొనే సత్తా  బీజేపీకి ఉందని అప్పట్లో  ఆమె భావించారు. అయితే  ఇటీవల జరిగిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో  కాంగ్రెస్ పార్టీలో  చేరాలని విజయశాంతి నిర్ణయం తీసుకున్నారు.ఈ క్రమంలోనే ఆమె  బీజేపీ తీరుపై  సోషల్ మీడియాలో  కొన్ని రోజులుగా పరోక్ష విమర్శలు చేశారు.  కాంగ్రెస్ పార్టీలో విజయశాంతి చేరుతారనే  ప్రచారం కూడ జోరుగా సాగుతుంది. ఈ ప్రచారానికి ఊతమిచ్చేలా  విజయశాంతి  అడుగులు వేస్తున్నారు. ఇవాళ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 

click me!