తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బడా నేతలు తమ ఓటు తమకే వేసుకోలేకపోతున్నారు. వారి ఓటు ఒక చోట ఉంటే పోటీ మరో చోటు నుంచి చేయడమే ఇందుకు కారణం. ఈ జాబితాలో ముఖ్యమంత్రి, మంత్రులు సహా పలు పార్టీలకు చెందిన సీనియర్ నేతలూ ఉన్నారు.
హైదరాబాద్: వారంతా బడా నేతలు.. గెలుపు దాదాపు ఖరారైన వారు.. వేల ఓట్ల మెజార్టీతో గెలిచే వారు. ఇతరులను ఓటు వేయాలని అడిగే ఈ నేతలు.. సొంత ఓటు వేసుకోలేకున్నారు. వీరికి ఓటు ఒక చోట ఉంటే.. మరో చోట నుంచి పోటీలో ఉండటమే ఇందుకు కారణం. చాలా మంది సీనియర్ నేతలకు ఈ పరిస్థితి ఉన్నది. వారికి ఓటు ఉన్న స్థానాలకు బయట వేరే స్థానాల్లో పోటీ చేస్తున్నారు.
ప్రస్తుత సీఎం కేసీఆర్‌కు కూడా ఈ పరిస్థితి ఎదురైనది. ఆరుగురు మంత్రులది ఇదే పరిస్థితి. బీజేపీ అభ్యర్థులు ఈటల రాజేందర్, అరవింద్ సహా కనీసం 59 మంది ముఖ్య నేతలకు ఇదే పరిస్థితి ఉన్నది. వీరంతా వారు పోటీ చేస్తున్న చోట్ల తమ గుర్తుకు ఓటు వేసుకునే అవకాశం లేదు.
undefined
సీఎం కేసీఆర్‌కు సిద్ధిపేటలోని చింతమడకలో ఓటు ఉన్నది. కానీ, ఆయన గజ్వేల్, కామారెడ్డి స్థానాల్లో పోటీ చేస్తున్నారు. ఈ రెండు స్థానాల్లోనూ ఆయనకు ఓటు లేదు. మంత్రి కేటీఆర్ పోటీ చేసేది సిరిసిల్ల అయితే.. ఓటు మాత్రం ఖైరతాబాద్‌లో ఉన్నది. రేవంత్ రెడ్డికి ఓటు కొడంగల్‌లో ఉండగా.. ఆయనకు ఓటు లేని కామారెడ్డి నుంచి కూడా బరిలో నిలబడిన సంగతి తెలిసిందే. ఈటల రాజేందర్‌కు హుజురాబాద్‌లో ఓటు ఉండగా.. ఈ స్థానంతోపాటు గజ్వేల్‌లోనూ ఆయన పోటీ చేస్తున్నారు.
Also Read: కుల జనగణన డిమాండ్‌ను కౌంటర్ చేయడానికి బీజేపీ కొత్త వ్యూహం ఇదేనా?
ధర్మపురి అరవింద్‌క నిజామాబాద్‌లో ఓటు ఉండగా, కోరుట్ల నుంచి బరిలో ఉన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఓటు వర్ధన్నపేటలో ఉండగా పాలకుర్తి నుంచి పోటీ చేస్తున్నారు. మంత్రి మల్లారెడ్డికి సికింద్రాబాద్‌లో ఓటు ఉండగా మేడ్చల్ నుంచి బరిలో దిగారు. తలసాని శ్రీనివాస్ యాదవ్, మర్రి రాజశేఖర్ రెడ్డిలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో ఓటు ఉన్నది. కానీ, వీరు సనత్ నగర్, మల్కాజిగిరిలలో పోటీ చేస్తున్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డికి చేవెళ్లలో ఓటు ఉన్నది. కానీ, ఆమె మహేశ్వరం నుంచి బరిలో నిలబడ్డారు. పల్లా రాజేశ్వర్ రెడ్డికి, అక్బరుద్దీన్ ఓవైసీకి ఖైరతాబాద్‌లో ఓటు ఉండగా.. వీరు జనగామ, చాంద్రాయణగుట్టలో పోటీలో ఉన్నారు.
Also Read: CPM : సంగారెడ్డిలో ఆసక్తికర పరిణామం.. సీపీఎం మద్దతు కోరిన మంత్రి హరీశ్ రావు
ఉత్తమ్ కుమార్ రెడ్డికి కోదాడలో ఓటుండగా.. హుజూర్ నగర్ నుంచి పోటీ చేస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నకిరేక్‌లో ఓటు ఉన్నది, మునుగోడు నుంచి పోటీలో ఉన్నారు. గడ్డం వివేక్‌కు మంచిర్యాలలో, గడ్డం వినోద్‌కు ఖైరతాబాద్‌లో ఓట్లు ఉన్నాయి. కానీ, చెన్నూరు, బెల్లంపల్లిల నుంచి పోటీ చేస్తున్నారు. మధుయాష్కీ గౌడ్‌కు నిజామాబాద్‌లో ఓటున్నది. కానీ, ఎల్బీ నగర్ నుంచి బరిలో ఉన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాలేరు నుంచి పోటీలో ఉండగా ఆయనకు సత్తుపల్లిలో ఓటు ఉన్నది. కొండా సురేఖకు పరకాలలో ఓటుండగా వరంగల్ ఈస్ట్ నుంచి పోటీ చేస్తున్నారు. కడియం శ్రీహరికి వరంగల్ వెస్ట్‌లో ఓటు ఉండగా.. స్టేషన్ ఘన్ పూర్ నంచి బరిలో నిలబడ్డారు. వీరితోపాటు మరికొందరు నేతలూ ఇలాగే తమకు తమ ఓటు వేసుకునే అవకాశాన్ని కోల్పోయారు.