K. Chandrashekar Rao...కాంగ్రెస్‌ను నమ్మితే మోసపోతాం: చొప్పదండి సభలో కేసీఆర్

By narsimha lodeFirst Published Nov 17, 2023, 3:48 PM IST
Highlights

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు  గడువు సమీపిస్తుంది. దీంతో  ప్రత్యర్ధులపై  విమర్శల దాడిని పార్టీలు పెంచాయి.  కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో  తెలంగాణ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు.
 

చొప్పదండి: కాంగ్రెస్ పాలనకు తమ ప్రభుత్వ పాలనకు మధ్య తేడాను చూడాలని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(కేసీఆర్)  ప్రజలను కోరారు.

శుక్రవారం నాడు  ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని  చొప్పదండిలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో  తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ హయాంలో అనేక బాధలు పడిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు.  తెలంగాణ ఇస్తామని ఇచ్చిన హామీని కూడ  కాంగ్రెస్ ఇవ్వలేదన్నారు.  తాను దీక్షకు దిగిన తర్వాతే కాంగ్రెస్ పార్టీ  తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ ను నమ్మితే మోసపోతారని  కేసీఆర్  చెప్పారు. 58 ఏళ్ల పాటు కాంగ్రెస్ పాలనలో బాధలు పడ్డామన్నారు.  

తెలంగాణ ఏర్పడిన తర్వాత అన్ని సమస్యలను  పరిష్కరించుకున్నట్టుగా  చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో  రూ. 200 పెన్షన్ మాత్రమే ఇచ్చిన విషయాన్ని ఆయన చెప్పారు. తమ ప్రభుత్వం పెన్షన్ ను  ఎంతిస్తుందో మీకు తెలుసునని చెప్పారు. తమను మరోసారి  అధికారం కల్పిస్తే  వచ్చే ఐదేళ్లలో పెన్షన్ ను రూ. 5016 వరకు పెంచుతామన్నారు. 

రాష్ట్రంలో  రైతులు  పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్న విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. రైతు చనిపోతే రూ. 5 లక్షల భీమాను కూడ అందిస్తున్న విషయాన్ని  కేసీఆర్ ప్రస్తావించారు. 

తమ ప్రభుత్వం తీసుకు వచ్చిన ధరణి పోర్టల్ ద్వారా  భూముల సమస్యలు లేవన్నారు.  ధరణి పోర్టల్ ను ఎత్తివేసి  భూమాత పోర్టల్ తెస్తామని  కాంగ్రెస్  ప్రకటించిన విషయాన్ని కేసీఆర్ ప్రస్తావించారు.  గతంలో కూడ ఇదే తరహలో భూభారతిని కాంగ్రెస్ కొనసాగించిందన్నారు.  కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో అంశంలోని అంశాలపై  కేసీఆర్ విమర్శలు చేశారు.

కొండగట్టు ఆలయాన్ని దివ్యధామంగా తీర్దిదిద్దుతామని కేసీఆర్ హమీ ఇచ్చారు. రూ. 1000 కోట్లు ఖర్చు పెట్టి కొండగట్టును అబివృద్ధి చేస్తామన్నారు. కొండగట్టు అభివృద్దిపై ప్రణాళికలు రూపొందించినట్టుగా ఆయన వివరించారు.

గతంలో ఈ ప్రాంతంలో  నీటి కోసం వందల బోర్లు వేసిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు.రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్ ను 24 గంటల విద్యుత్ ను సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని  కేసీఆర్ చెప్పారు.  ప్రధాన మంత్రి  మోడీ స్వంత రాష్ట్రం గుజరాత్ లో కూడ   24 గంటల ఉచిత విద్యుత్ రైతులకు అమలు చేయడం లేదన్నారు. రైతుల కష్టాలు తీరేలా  ఒక ప్రణాళికను రూపొందించినట్టుగా ఆయన చెప్పారు.

దేశంలో  157 మెడికల్ కాలేజీలను కేంద్రం ఏర్పాటు చేస్తే  తెలంగాణకు ఒక్కటి కూడ మంజూరు చేయలేదన్నారు.  అంతేకాదు  దేశ వ్యాప్తంగా  నవోదయ స్కూళ్లను  మంజూరు చేసిన కేంద్ర సర్కార్ తెలంగాణకు ఒక్క స్కూల్ కూడ ఇవ్వలేదని ఆయన విమర్శించారు.  ఈ విషయమై  ఓటు కోసం వచ్చే బీజేపీ నేతలను నిలదీయాలని కేసీఆర్  కోరారు.

click me!