K.Chandrashekar Rao...కాంగ్రెస్ ఫిర్యాదు వల్లే రైతుబంధు నిలిపివేత: షాద్‌నగర్ సభలో కేసీఆర్

By narsimha lode  |  First Published Nov 27, 2023, 2:12 PM IST


రైతు బంధుపై  కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి మధ్య  మాటల యుద్ధం సాగుతుంది.కాంగ్రెస్ ఫిర్యాదుపై రైతుబంధును ఈసీ నిలిపివేసిందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది.హరీష్ రావు వ్యాఖ్యల వల్లే రైతుబంధు నిలిచిపోయిందని  కాంగ్రెస్ ఎదురుదాడికి దిగుతుంది.



షాద్‌నగర్:  కాంగ్రెస్ నేతలు మరోసారి ఫిర్యాదు చేస్తే రైతుబంధును  ఎన్నికల సంఘం (ఈసీ) నిలిపివేసిందని తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆరోపించారు. సోమవారంనాడు  షాద్ నగర్ లో  భారత రాష్ట్ర సమితి నిర్వహించిన  ప్రజా ఆశీర్వాద సభలో  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) పాల్గొన్నారు.

రైతు బంధును నిలిపివేయాలని కాంగ్రెస్ నేతలు గత నెలలో ఫిర్యాదు చేసిన విషయాన్ని  కేసీఆర్ గుర్తు చేశారు.అయితే ఈ విషయమై తన వినతి మేరకు  ఈ నెల  28న  రైతుబంధు ఇచ్చేందుకు ఈసీ ఒప్పుకుందని కేసీఆర్   చెప్పారు. అయితే రైతుబంధు విషయమై కాంగ్రెస్ నేతలు మరోసారి  ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారని కేసీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ నేతల  ఫిర్యాదు మేరకు  రైతుబంధును ఎన్నికల సంఘం నిలిపివేసిందని కేసీఆర్  ఆరోపించారు.

Latest Videos

undefined

రైతు బంధుతో ప్రజల డబ్బు వృధా చేస్తున్నానని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారని కేసీఆర్ చెప్పారు. రైతుబంధు వృధానా అని ఆయన ప్రశ్నించారు.మరోసారి బీఆర్ఎస్ ను గెలిపిస్తే  రైతుబంధును కొనసాగించడమే కాకుండా ఈ నిధులను  రూ. 16 వేలకు పెంచుతామని కేసీఆర్ హామీ ఇచ్చారు.

ధరణి పోర్టల్ తో రైతుల భూములు నిశ్చింతగా ఉన్నాయని కేసీఆర్  చెప్పారు.రైతుల వేలిముద్రలు లేకుండా  భూ రికార్డులను సీఎం కూడ మార్చలేరన్నారు.ధరణిని ఎత్తివేసి భూమాత తెస్తామంటున్నారు. అది భూమాతా? భూమేతా అని ఆయన  వ్యంగ్యస్త్రాలు సంధించారు.

also read:kodangal కోటపై నిలిచిదేవరు?:రేవంత్ , పట్నం..రమేష్‌లలో కొడంగల్ ఓటర్లు పట్టం ఎవరికీ

కౌలు రైతులకు రైతుబంధు ఇస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్న విషయాన్ని కేసీఆర్ ప్రస్తావించారు. ఎవరైనా మూడేళ్లు భూమిని కౌలుకు ఇస్తే భూమిపై హక్కులు పోతాయని కేసీఆర్  చెప్పారు.రైతుబంధు తీసేస్తే  రైతుబంధు డబ్బులు ఎలా వస్తాయని  కేసీఆర్ ప్రశ్నించారు.

also read:N.T.Rama Rao...1989లో కల్వకుర్తిలో ఎన్‌టీఆర్ ఓటమి, చిత్తరంజన్ దాస్ గెలుపు:కారణాలివీ..

ఇందిరమ్మ రాజ్యం తెస్తామని కాంగ్రెస్ నేతలంటున్నారని ఆయన చెప్పారు.ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి కేకలు తప్ప ఏమీ ఉండదన్నారు.పదేళ్ల క్రితం తెలంగాణ ఎట్లుండే ఇప్పుడెట్ల ఉందని కేసీఆర్ ప్రశ్నించారు.కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎవరూ కలలో కూడ అనుకోలేదన్నారు.రాష్ట్రంలో మూడు కోట్ల మందికి కంటి పరీక్షలు నిర్వహించామన్నారు కేసీఆర్.

click me!