భారత్ తో సహ ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ డౌన్.. దాదాపు గంటసేపు నిలిచిపోయిన స్ట్రిమింగ్..

By asianet news teluguFirst Published May 19, 2021, 12:05 PM IST
Highlights

ప్రముఖ వీడియొ స్ట్రిమింగ్ యాప్ యూట్యూబ్ నేడు ఉదయం స్తంభించిపోయింది. దీంతో  ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ వినియోగదారులు  వీడియోలు వీక్షించడం, లాగిన్ అవడంలో సమస్యలు ఎదురుకున్నారు.

ప్రపంచంలోని అతిపెద్ద వీడియో స్ట్రీమింగ్ వెబ్‌సైట్ యూట్యూబ్ మే 19 ఉదయం డౌన్ అయ్యింది. దాదాపు గంటసేపు స్ట్రిమింగ్ నిలిచిపోయిన తర్వాత యూట్యూబ్‌ తిరిగి పనిచేయడం ప్రారంభించింది.

 

We’re seeing reports around difficulties accessing YouTube services within the last hour. We can confirm that this is now fixed and you should be able to access our service without any issues.

Thanks for your reports and do let us know if you’re still facing any problems!

— TeamYouTube (@TeamYouTube)

దీనికి సంబంధించి యూట్యూబ్ ఒక ట్వీట్  ద్వారా సర్వీస్ ఆగిపోయినట్లు ధృవీకరించింది. యూట్యూబ్ డౌన్ అయిన తర్వాత #YouTubeDOWN ట్విట్టర్‌లో ట్రెండింగ్ అయ్యింది.

యూట్యూబ్  యాప్, డెస్క్‌టాప్ వెర్షన్‌లో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వినియోగదారులు వీడియోలను చూడలేకపోవడం అలాగే లాగిన్ చేయలేకపోయాయరు. డౌన్‌డిటర్ కూడా యూట్యూబ్ డౌన్ అయినట్లు ధృవీకరించారు.

 

If you were having issues uploading or watching videos on YouTube (including live streams) in the last ~45 mins – this issue has been fixed.

Note: if your video is processing, it should complete now – otherwise you may need to reupload.

Thanks for all of your reports!

— TeamYouTube (@TeamYouTube)

ఉదయం 8 గంటలకు యూట్యూబ్ డౌన్‌ అయినట్లు సుమారు 89 మంది ఫిర్యాదు చేశారు. ఉదయం 8.33 నాటికి ఫిర్యాదుల సంఖ్య 8 వేలకు పైగా పెరిగింది. వీడియో ప్లే కాకపోవడంపై 90 శాతం మంది ఫిర్యాదు చేశారు.అలాగే  2 శాతం మందికి లాగిన్ అవ్వడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి.


 

Me switching through my wifi and celluar data just to soon realize that youtube is down. pic.twitter.com/FXrjK9855K

— ✨Raven✨ (@XRavenXoX)
click me!