ఏంటీ ఈ ‘‘టిక్ టాక్’’ యాప్.. ఎందుకు నిషేధం..?

By ramya NFirst Published Feb 13, 2019, 2:59 PM IST
Highlights

ఈమధ్యకాలంలో విపరీతంగా పాపులర్ అయిన సోషల్ నెట్ వర్కింగ్ యాప్ ‘‘ టిక్ టాక్’’.  సినిమాల్లోని పాటలు, పాపులర్ డైలాగ్స్, ఎమోషన్స్ ఇలా ఒకటేంటి అన్నింటినీ ఈ యాప్ ద్వారా వీడియో క్రియేట్ చేసుకోవచ్చు.  


ఈమధ్యకాలంలో విపరీతంగా పాపులర్ అయిన సోషల్ నెట్ వర్కింగ్ యాప్ ‘‘ టిక్ టాక్’’.  సినిమాల్లోని పాటలు, పాపులర్ డైలాగ్స్, ఎమోషన్స్ ఇలా ఒకటేంటి అన్నింటినీ ఈ యాప్ ద్వారా వీడియో క్రియేట్ చేసుకోవచ్చు.  గతంలో వచ్చిన డబ్ స్మాష్ లాగానే ఇది కూడా ఉంటుంది. కాకపోతే.. ఇది మరింత పాపులరిటీ సంపాదించుకుంది. ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే. ఈ యాప్ ను చాలా మంది దుర్వినియోగం చేస్తున్నారు.

అశ్లీల చిత్రాలు, మత పరమైన విధ్వంసాలు, హింసను ప్రేరేపించేలా కొందరు టిక్ టాక్ లో వీడియోలను తయారు చేస్తున్నారు. దీంతో.. దీనిపై నిషేధం ప్రకటించాలని తొలిసారిగా తమిళనాడు ప్రభుత్వం కోరుతోంది.  శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మునిదనేయ జననాయగ కట్చి ఎమ్మెల్యే తమీమున్ హన్సారీ.. టిక్ టాక్ యాప్‌ను తక్షణమే రాష్ట్రంలో నిషేధించాలని కోరారు.

అశ్లీల చిత్రాలు, పలు వర్గాలు, మతాల మధ్య హింసను ప్రేరేపించే సంభాషణలు అధికంగా ఉన్నాయన్నారు. అందువల్ల ఈ యాప్‌ను నిషేధించాల్సిన అవసరం ఉందన్నారు. దీనికి రాష్ట్ర సమాచార, సాంకేతిక శాఖ మంత్రి మణికంఠన్ సమాధానం ఇచ్చారు.. టిక్ టాక్ యాప్‌ను నిషేధించేందుకు చర్యలు తీసుకుంటామని, దీనిపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు. 

ఒక రిపోర్టు ప్రకారం.. ఈ టిక్ టాక్ వీడియోలు చేసేందుకు యువత ఎన్ని ప్రయోగాలు అయినా చేయడానికి రెడీ ఉంటున్నారని తెలుస్తోంది. ఇటీవల ఓ యువకుడు అమ్మాయి డ్రస్ వేసుకొని టిక్ టాక్ లో వీడియో చేసేందుకు ట్రయిన్ ముందు నుంచి దూకేశాడు. ఈయాప్ వినియోగిస్తోందని నాయనమ్మ తిట్టిందని..ముంబయిలో ఓ యువతి అయితే.. ఆత్మహత్య కూడా చేసుకున్నట్లు సమాచారం.

బ్లూవేల్ గేమ్ మాదిరిగానే ఇది కూడా ప్రమాదకరమైనది పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఇండియాలో 25మిలియన్ల మంది ఈ యాప్ ని వినియోగిస్తున్నారు. 

click me!