సాఫ్ట్‌వేర్, యాప్ డెవలపర్లకు యమ డిమాండ్

By Arun Kumar PFirst Published Oct 12, 2018, 2:40 PM IST
Highlights

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, యాప్ డెవలపర్ల కోసం ఐటీ సంస్థల నుంచి డిమాండ్ పెరుగుతోందని మైక్రోసాఫ్ట్ అనుబంధ సంస్థ ‘లింక్డ్ ఇన్’ పేర్కొంది.

న్యూఢిల్లీ: ఐటీ పరిశ్రమలో ప్రొఫెషనల్స్ తర్వాత సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు, యాప్ డెవలపర్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ విషయమై ప్రొఫెషనల్ నెట్ వర్కింగ్ ప్లాట్ ఫామ్ లింక్డ్ ఇన్ నిర్వహించిన సర్వేలో తేలింది. టెక్నాలజీ మేజర్ మైక్రోసాఫ్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థ ‘లింక్డ్ఇన్’  తొలిసారి భారతదేశంలో అవసరాలపై ‘వర్క్ ఫోర్స్ రిపోర్ట్ ఫర్ ఇండియా’ పేరుతో నిర్వహించిన సర్వేలో ఈ విషయం బయటపడింది. భారతదేశంలోని ఐటీ రంగంలో ఉద్యోగ నియామకాలపై లింక్డ్ ఇన్ సర్వే జరిపింది. 

2018లో తొలి ఆరు నెలల్లో భారతదేశంలోని ఐటీ సంస్థలన్నీ భారీగా సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు, యాప్ డెవలపర్లను నియమించుకున్నాయి. అప్లికేషన్ల డెవలపర్ల కంటే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల నియామకాలు రెండు రెట్లకు పైగా పెరిగాయని లింక్డ్ ఇన్ తెలిపింది. డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ దిశగా అడుగులేస్తున్న ఐటీ పరిశ్రమ క్లౌడ్, అనలిటిక్స్, క్రుత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్స్ విభాగాల్లో నిష్ణాతులైన నూతన తరం ఇంజినీర్ల నియామకాలు వడివడిగా సాగుతున్నాయి. 

ప్రతి ఐటీ సంస్థ పరిధిలో టాప్ 10 విభాగాల్లో టెక్నాలజీ అనుబంధ ఉద్యోగాలు బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్లు, ప్రొడక్ట్ మేనేజర్ల నియామకాలు సాగాయని లింక్డ్ ఇన్ ఆసియా పసిఫిక్ అండ్ జపాన్ మేనేజింగ్ డైరెక్టర్ ఓలివర్ లేగ్రాండ్ తెలిపారు. అమెరికా, బ్రిటన్ దేశాల్లో ఐటీ రంగంలో ఉద్యోగ నియామకాలతోపాటు భారతదేశంలోనూ లింక్డ్ ఇన్ ఉద్యోగ నియామకాలపై సర్వే నిర్వహించింది. 

భారతదేశంలో ఏటా 10 లక్షల మందికి పైగా ఇంజినీరింగ్ విద్యార్థులు బయటకు వస్తున్నారని లింక్డ్ ఇన్ ఆసియా పసిఫిక్ అండ్ జపాన్ మేనేజింగ్ డైరెక్టర్ ఓలివర్ లేగ్రాండ్ చెప్పారు. ప్రత్యేకమైన నైపుణ్యం గల ఐటీ ఇంజినీర్ల కోసం సాఫ్ట్‌వేర్ సంస్థలు ఎదురుచూస్తున్నాయని తెలిపారు. పారిశ్రామికంగా వివిధ విభాగాల్లో ఉన్న అంతరాయాలను తొలగించేందుకు పలు రకాల ఆపర్లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని లింక్డ్ ఇన్ ఆసియా పసిఫిక్ అండ్ జపాన్ మేనేజింగ్ డైరెక్టర్ ఓలివర్ లేగ్రాండ్ వివరించారు. 

మేథో సంపద రెండు రకాలుగా వలస వెళుతున్నదని లింక్డ్ ఇన్ ఆసియా పసిఫిక్ అండ్ జపాన్ మేనేజింగ్ డైరెక్టర్ ఓలివర్ లేగ్రాండ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేకించి ఆస్ట్రేలియా, బ్రిటన్, సింగపూర్, జర్మనీ తదితర దేశాలకు మేధావులు తరలి వెళుతున్నారు. లీగల్, ఎడ్యుకేషన్, డిజైన్ రంగ పరిశ్రమలు శరవేగంగా అభివ్రుద్ధి చెందుతున్నాయి. పది లక్షలకు పైగా ఐటీ సంస్థలు ఉండగా, భారతదేశంలో ఐదు కోట్ల మంది నిపుణులు ఉన్నారని చెప్పారు. 

click me!