రాఫెల్ డీల్ ముందు మా ‘రూ.550 కోట్లు’ ఏపాటి?

By rajesh yFirst Published Feb 14, 2019, 11:07 AM IST
Highlights


‘రాఫెల్’యుద్ధ విమానాలు కొనుగోలు కోసం చేయడానికి అవసరమైన ఒప్పందం కుదుర్చుకోవడానికి, ప్లాంట్ ఏర్పాటు చేయడానికి నిదులు ఉంటాయి గానీ తమ రూ.550 కోట్లు చెల్లించడానికే నిదుల్లేవా? అని రిలయన్స్ అడాగ్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీను స్విస్ టెలికం మేజర్ ఎరిక్సన్ నిలదీసింది. కాగా ఈ కేసు విచారణ కోసం రిలయన్స్ కమ్యూనికేషన్స్ అధినేతగా అనిల్ అంబానీ వరుసగా రెండు రోజులుగా కోర్టు నుంచి బయటకు అడుగు పెట్టలేకపోతున్నారు. 

న్యూఢిల్లీ: అనిల్‌ అంబానీ నాయకత్వంలోని రిలయన్స్‌ గ్రూప్‌పై టెలికాం పరికరాల సరఫరా సంస్థ ఎరిక్సన్‌ సుప్రీం కోర్టులో తీవ్ర ఆరోపణలు చేసింది. ‘రాఫెల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు వారి వద్ద నిధులు ఉంటాయి. మాకు చెల్లించాల్సిన రూ.550 కోట్లు మాత్రం చెల్లించరు. ఈ బకాయిలు చెల్లిస్తామని గతంలో సుప్రీం కోర్టుకు ఇచ్చిన హామీకి కూడా వారు కట్టుబడడం లేదు. అయినా ప్రతి ఒప్పందాల్లోనూ వారి పాత్ర కనిపిస్తోంది’ అని ఎరిక్సన్‌ తరఫున వాదించిన దుష్యంత్‌ దావే సుప్రీం కోర్టు ధర్మాసనానికి తెలిపారు. 

ఈ విషయంలో ఎస్బీఐ చైర్మన్‌ కూడా అనిల్ అంబానీతో కుమ్మక్కయ్యారని దుష్యంత్ దవే ఆరోపించారు. దుష్యంత్ దవే వాదనతో రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఆర్‌కామ్‌) చైర్మన్‌ అనిల్‌ అంబానీ, రిలయన్స్‌ టెలికాం కంపెనీ చైర్మన్‌ సతీష్‌ సేథ్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రాటెల్‌ చైర్‌పర్సన్‌ ఛాయా విరానీ తరఫున వాదించిన సీనియర్‌ లాయర్‌ ముఖుల్‌ రోహత్గీ, కపిల్‌ సిబల్‌, ఎస్‌బీఐ చైర్మన్‌ తరఫు లాయర్‌ నీరజ్‌ కిషన్‌ కౌల్‌ విభేదించారు 

ముకేశ్‌ అంబానీ నాయకత్వంలోని రిలయన్స్‌ జియోకు ఆర్‌కామ్‌ ఆస్తులు అమ్మేందుకు జరిగిన ప్రయత్నాలు విఫలమవడం వలనే సుప్రీం కోర్టుకు హామీ ఇచ్చిన విధంగా ఎరిక్సన్‌ కంపెనీకి చెల్లించాల్సిన రూ.550 కోట్లు చెల్లించలేకపోతున్నట్టు సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపారు.
 
రెండు పక్షాల వాదన విన్న సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ కేసులో తీర్పును రిజర్వులో పెట్టింది. గత ఏడాది అక్టోబరు 23న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం బకాయిలు చెల్లించడంలో విఫలమైతే 12 శాతం వడ్డీతో చెల్లించాలి. ప్రస్తుతం ఆర్‌కామ్‌ ఆర్థిక పరిస్థితి చూస్తే ఆ పరిస్థితి కనిపించడం లేదు. దీంతో సర్వోన్నత న్యాయస్థానం ఏ తీర్పు చెబుతుందోనన్న ఆసక్తి వ్యక్తమవుతోంది.
 
వరుసగా రోజంతా కోర్టులోనే ఈ కేసు విచారణ కోసం అనిల్‌ అంబానీ వరుసగా రెండో రోజూ సుప్రీం కోర్టులోనే గడిపారు. ఆయనతో పాటు అడాగ్‌ గ్రూపులోని రెండు కంపెనీ చైర్మన్లూ కోర్టులో గడపాల్సి వచ్చింది.
 
తనఖా షేర్ల విక్రయంపై అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ పవర్‌ బొంబాయి హైకోర్టును ఆశ్రయించింది. ఎడెల్‌వైజ్‌ గ్రూపు తమ సంస్థ తాకట్టు పెట్టిన షేర్లను విక్రయించిన లావాదేవీని రద్దు చేయాలని కోరింది. కానీ, విక్రయ లావాదేవీని రద్దు చేయడానికి, ఆర్‌ పవర్‌కు తాత్కాలిక ఊరటనిచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఈ విషయంపై విచారణను గురువారానికి వాయిదా వేసింది. 
 

click me!