అమెజాన్ ప్రైమ్ డే ఆఫర్లు 48 గంటలు.. వాల్‌మార్ట్ కూడా

By rajesh yFirst Published Jun 27, 2019, 12:05 PM IST
Highlights

ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది జూలై 15వ తేదీ అర్థరాత్రి నుంచి ఆన్ లైన్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ డే ఆఫర్లు అందుబాటులోకి తెచ్చింది. ఈ దఫా 48 గంటల పాటు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్‌లో 10 లక్షల డీల్స్ జరుగుతాయని అంచనా.

న్యూఢిల్లీ: గ్లోబల్ ఆన్‌లైన్ రిటైల్ దిగ్గజం ‘అమెజాన్’ తన వినియోగదారులకు  మరోసారి తీపి కబురు చెప్పింది. ప్రైమ్‌ డే 2019 సేల్‌ను  ప్రపంచ వ్యాప్తంగా ప్రారంభించనున్నది. ఈ మేరకు అమెజాన్‌ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. జూలై 15- 16 తేదీల మధ్య రెండు రోజుల పాటు వివిధ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లను ఆఫర్‌ చేస్తున్నట్టు ప్రకటించింది.

ముఖ‍్యంగా ఈసారి ప్రైమ్‌ డే సేల్‌ ను గ్లోబల్‌గా 48 గంటల పాటు అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపింది. ఆపిల్‌, వన్‌ప్లస్‌, శామ్‌సంగ్‌ తదితర ప్రముఖ కంపెనీల టీవీలు, స్మార్ట్‌ఫోన్లు తదితర ఉత్పత్తులను ఈ సేల్‌లో తక్కువ ధరలకే తన అభిమానులకు అందించనుంది. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌, డెబిట్‌ కార్డు కొనుగోళ్లపై 10 శాతం ఇన్‌స్టెంట్‌ క్యాష్‌ బ్యాక్‌ను అందించనుంది. 

ఇండియా, అమెరికా, కెనడా, బ్రిటన్, స్పెయిన్, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, చైనా, బెల్జియం, ఆస్ట్రియాదేశాలతో పాటు ఈ ఏడాది యూఏఈలో ఈ  ప్రైమ్‌ డే సేల్‌ ను తొలిసారి పరిచయం చేస్తోంది. ప్రైమ్ డే ఆఫర్‌లో 10 లక్షల డీల్స్ జరుగుతాయని అంచనా వేస్తున్నారు. గతేడాది అమెజాన్ ప్రైమ్ డే ఆఫర్లు జూలై 15వ తేదీన మొదలై 36 గంటలు కొనసాగింది. దీనికి ముందు ప్రీ ప్రైమ్ డే ఆఫర్లను కూడా అమెజాన్ అందుబాటులోకి తెస్తోంది. ఉదాహరణకు తొషిబా 43 అంగుళాల 1080పీ ఫైర్ టీవీ 180 డాలర్ల నుంచి 120 డాలర్లకే లభిస్తుంది. 

అమెజాన్ బాటలోనే మరో ఆన్ లైన్ దిగ్గజం ‘వాల్ మార్ట్’ ప్రైమ్ డే ఆఫర్లు అందిస్తోంది. వాల్ మార్ట్ డాట్ కామ్ వెబ్ సైట్ ద్వారా వచ్చే నెల 14 నుంచి 17వ తేదీ వరకు పలు వస్తువులపై రాయితీలు అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది. 

click me!