క్యాబ్‌ల్లో ఫోన్లతోపాటు విలువైన వస్తువులు మిస్సింగ్

By ramya NFirst Published Mar 7, 2019, 3:03 PM IST
Highlights

ఇప్పుడంతా స్మార్ట్ ఫోన్ల మయం. కొంతమందికి ఎప్పుడూ చేతిలో ఫోన్‌ ఉండాల్సిందే. తినేటప్పుడు, నిద్ర పోయేటప్పుడు కూడా ఫోన్ వదిలిపెట్టని వారు ఉన్నారు.

ఇప్పుడంతా స్మార్ట్ ఫోన్ల మయం. కొంతమందికి ఎప్పుడూ చేతిలో ఫోన్‌ ఉండాల్సిందే. తినేటప్పుడు, నిద్ర పోయేటప్పుడు కూడా ఫోన్ వదిలిపెట్టని వారు ఉన్నారు. భారతీయులు మాత్రం ఎక్కువగా ఫోన్‌నే మర్చిపోతున్నారని ప్రముఖ క్యాబ్‌ సర్వీసుల సంస్థ ఉబర్‌ తాజాగా తెలిపింది.

ఇండియన్లు ఫోన్లతోపాటు ఆభరణాలు తదితరాలు మిస్సింగ్
ఇందులో భారతీయులు ఫోన్లతో పాటు బంగారు ఆభరణాలు, అరటిపళ్లు, కూరగాయలు, చేపలను క్యాబ్‌లలో మర్చిపోతున్నారని తాజాగా ‘లాస్ట్‌ అండ్‌ ఫౌండ్‌ ఇండెక్స్‌’అనే పేరుతో విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. అయితే ఇలాంటి ఘటనలు ఎక్కువగా బెంగళూరులోనే జరుగుతున్నాయని తేలింది. 

మోస్ట్ ఫర్గెటబుల్ సిటీగా బెంగళూరు
దీంతో బెంగళూరు ‘మోస్ట్‌ ఫర్గెటబుల్‌ సిటీ’గా నిలిచింది. దీని తర్వాతి స్థానంలో ఢిల్లీ, ముంబై నగరాలు ఉన్నాయి. ఇలా మర్చిపోతున్న వస్తువుల జాబితా టాప్‌-10లో వాలెట్లు‌, తాళాలు, దుస్తులు, గొడుగులు, విలువైన పత్రాలు కూడా స్థానం దక్కించుకున్నాయి. 

వారాంతంలోనే ఎక్కువగా ఫోన్లు మరిచిపోతున్న కేసులు
వస్తువులను మర్చిపోతున్న కేసులు మిగిలిన రోజుల కంటే వారాంతాల్లోనే ఎక్కువగా నమోదవుతున్నాయి. గతేడాది జనవరి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు చేసిన ఈ సర్వేలో సెప్టెంబర్‌ అత్యధికంగా వసువులు మర్చిపోయిన నెలగా నిలిచింది. ఇందులోనూ 1,2,8 తేదీల్లోనే ఎక్కువమంది వస్తువులను విస్మరించారని ఈ నివేదిక పేర్కొంది. ఉబర్‌ క్యాబ్‌లలో వస్తువులను మర్చిపోయిన ఘటనలకు సంబంధించి ఫిర్యాదు చేసే సౌకర్యం ఉందన్న విషయం తెలిసిందే.

సీఎన్జీ వర్షన్‌లో మారుతీ వ్యాగనార్‌ 
అగ్రగామి కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇటీవల విడుదల చేసిన వ్యాగన్‌ఆర్‌ 2019లో రెండు కొత్త సీఎన్‌జీ వేరియంట్లను విపణిలోకి విడుదల చేసింది. వ్యాగన్‌ఆర్‌ ఎస్‌-సీఎన్‌జీ ఎల్‌ఎక్స్‌ఐ వేరియంట్‌ ధర రూ.4.84 లక్షలుగా, ఎల్‌ఎక్స్‌ఐ (ఓ) వేరియంట్‌ ధర రూ.4.89 లక్షలుగా నిర్ణయించారు. ఒక లీటర్‌ ఇంజిన్‌ అమర్చిన సీఎన్జీ వెర్షన్‌ కేజీకి 33.54 కి.మీ మైలేజీ ఇస్తుందని మారుతీ సుజుకి తెలిపింది. ‘వ్యాగన్‌ఆర్‌ ఎస్‌-సీఎన్‌జీతో వినియోగదారులకు 26% అధిక మైలేజీ అందిస్తుంది. అధునాతన టెక్నాలజీ రూపొందించిన ఈ కారు పూర్తిగా పర్యావరణహితం, భద్రమైనద’ని మారుతీ సుజుకీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (మార్కెటింగ్‌, అమ్మకాలు) ఆర్‌ఎస్‌ కల్సీ పేర్కొన్నారు.

click me!