Google మీ ప్రతి కదలికను ట్రాక్ చేస్తుంది.. అలా జరకుండా ఉండాలంటే ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి..

By Sumanth KanukulaFirst Published Dec 26, 2021, 11:46 AM IST
Highlights

గూగుల్ (Google) మన కదలికలను నిత్యం ట్రాక్ చేస్తుందనే సంగతి మీకు తెలుసా..? మనం వేసే ప్రతి అడుగును గూగుల్ పసిగడుతుంది. మన సెర్చ్ హిస్టరీ , మన మొబైల్ లోకేషన్, చూసే ప్రకటనలు, వీడియోలు, ఇతర సమాచారాన్ని కూడా గూగుల్ రికార్డు చేస్తుంది. దీని వల్ల కొన్నిసార్లు మీ గోప్యతకు భంగం వాటిల్లే ప్రమాదం ఉంది. అయితే మీ కదలికలను గూగుల్ ట్రాక్ చేయకుండా ఉండాలని అనుకుంటే.. కొన్ని సెట్టింగ్స్‌లో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.

గూగుల్ మన కదలికలను నిత్యం ట్రాక్ చేస్తుందనే సంగతి మీకు తెలుసా..? మనం వేసే ప్రతి అడుగును గూగుల్ పసిగడుతుంది. ఇంటర్‌కనెక్ట్ చేయబడిన అప్లికేషన్‌లు, సేవల గురించిన వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడమే కాకుండా మార్పిడి కూడా చేస్తుంది. అంతేకాకుండా మన సెర్చ్ హిస్టరీ , మన మొబైల్ లోకేషన్, చూసే ప్రకటనలు, వీడియోలు, ఇతర సమాచారాన్ని కూడా గూగుల్ రికార్డు చేస్తుంది. దీని వల్ల కొన్నిసార్లు మీ గోప్యతకు భంగం వాటిల్లే ప్రమాదం ఉంది. అందుకే ఇది ఆందోళన కలిగించే అంశమనే చెప్పాలి. అయితే మీ కదలికలను గూగుల్ ట్రాక్ చేయకుండా ఉండాలని అనుకుంటే.. కొన్ని సెట్టింగ్స్‌లో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఫలితంగా గూగుల్‌లో customization కోల్పోవాల్సి వస్తుంది. 

వెబ్‌ వెర్షన్‎లో మీ గూగుల్ ఖాతాలో యాక్టివిటీ కంట్రోల్స్ పేజీలో కొన్ని సెట్టింగ్స్ మార్చడం ద్వారా గూగుల్ పర్యవేక్షణను నియంత్రించవచ్చు. మీరు ఇప్పటికే మీ బ్రౌజర్‌లో గూగుల్‌ అకౌంట్‎లో లాగిన్ అయి ఉంటే.. మీ గూగుల్ అకౌంట్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఆపై మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. తర్వాత సెర్చ్ బాక్స్‌లో Activity Controls అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయడడి. అప్పుడు మీకు గూగుల్‌కు సంబంధించి ఆరు కేటగిరీలు కనిపిస్తాయి. స్క్రీన్‌పై టోగుల్ బటన్‌లను ఆన్ అండ్ ఆఫ్ చేయడం ద్వారా మీరు గూగుల్ ట్రాకింగ్‌ను నిలిపివేయవచ్చు. ముఖ్యంగా మొదటి రెండు కేటగిరీలు అయిన వెబ్ అండ్ యాప్ యాక్టివిటీ (Web & App Activity), లొకేషన్ హిస్టరీ (Location History) సెట్టింగ్స్ మార్చుకోవాలి.

1. Googleలో సైన్ ఇన్ చేసినప్పుడు మీరు సెర్చ్ చేసే ప్రతి అంశం, ఆన్‌లైన్ యాక్టివిటీస్ అని వెబ్ అండ్ యాప్ యాక్టివిటీలో స్టోర్ అవుతాయి. అలా కాకుండా ఉండాలంటే గూగుల్ యాక్టివిటీ పేజీపైన క్లిక్ చేసి టోగుల్ ఆఫ్ చేయండి. ఇదే పేజీలో Auto-delete ఆప్షన్ కూడా ఎంచుకుని.. మాన్యువల్ గా డేటాను డిలీట్ చేసుకోవచ్చు.

2. Manage all Web & App Activity మీద క్లిక్ చేస్తే.. మీరు యూజ్ చేస్తున్న అన్ని అప్లికేషన్‌ల సమాచారాన్ని గూగుల్ మానిటర్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. అప్పుడు మీరు “ఫిల్టర్ బై డేట్ ప్రొడక్ట్” పై క్లిక్ చేసి.. అక్కడ సమయాన్ని ఎంచుకుని.. ఆ కాల వ్యవధిలో గూగుల్ కలెక్ట్ చేసిన సమాచారాన్ని డిలీట్ చేయండి.

3. లేకపోతే సెర్చ్ యాక్టివిటీ పక్కనే ఉన్న త్రీ డాట్స్ పై క్లిక్ చేసి ఒక్కొక్క దాన్ని కూడా డిలీట్ చేసుకోవచ్చు. గూగుల్ సేకరించిన డేటా మొత్తం డిలీట్ చేయడానికి.. డిలీట్ యాక్టివిటీ బై‌‌‌లోకి వెళ్లి అక్కడ ఆల్ టైం ఆప్షన్ పై క్లిక్ చేసి డిలీట్ బటన్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది. 

4. ఇటీవల ఇందులో కొత్త ఆప్షన్ కూడా వచ్చింది. 3, 18 నెలల క్రితం డేటాను ఆటోమేటిక్‌గా డిలీట్ చేసుకోవచ్చు. ఇందుకోసం “Auto-delete” ఆప్షన్‌ను ఎంచుకుని నచ్చిన టైమ్‌ను సెట్ చేసుకోవాలి. 

5. గూగుల్ సెర్చ్ , అసిస్టెంట్, మ్యాప్స్ లలో మీరు వాయిస్ ఉపయోగించి సెర్చ్ చేస్తున్నట్లయితే.. ఆ రికార్డింగ్‌లు గూగుల్ లో స్టోర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ గూగుల్ అసిస్టెంట్‌లో మీ వాయిస్‌ స్టోర్ అవ్వకుండా ఉండాలంటే అండ్రాయిడ్ ఫోన్‌ ద్వారా ఈ సెట్టింగ్స్ చేస్తే సరి.. 

-మీ అండ్రాయిడ్ ఫోన్ నుంచి Hey Google, open Assistant settings అని వాయిస్ కమాండ్ ఇవ్వండి. తర్వాత ఆల్ ఆప్షన్స్‌లోని జనరల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అక్కడ గూగుల్ అసిస్టెంట్ ఆఫ్/ఆన్ అనే టోగుల్ కనిపిస్తుంది.. దానిని ఆఫ్ చేస్తే సరిపోతుంది.
- లేకపోతే.. గూగుల్ అప్లికేషన్ ఓపెన్ చేసి మోర్‌ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. తర్వాత సెట్టింగ్స్ సెలెక్ట్ చేసుకొని.. గూగుల్ అసిస్టెంట్ ఆప్షన్ పై నొక్కండి. తర్వాత అసిస్టెంట్ డివైజెస్ సెక్షన్ లో “ఫోన్” అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి టోగుల్‌ను డిసెబుల్ చేయండి.
- మీరు ఇలా చేసినప్పుడు.. ఇకపై పనిచేయని ఫీచర్ల గురించి మీకు పాప్-అప్ సందేశం వస్తుంది. సందేశం పక్కన ఉన్న 'టర్న్ ఆఫ్' బటన్‌ను నొక్కండి.

click me!