మొబైల్ గేమ్ లవర్స్ కి గుడ్ న్యూస్.. న్యూ ఇయర్ నుండి ఈ గేమ్ మళ్ళీ ఇండియాలోకి తిరిగి వస్తుంది..?

By asianet news teluguFirst Published Dec 30, 2022, 6:02 PM IST
Highlights

నివేదిక ప్రకారం, ఈ గేమ్‌ను అభివృద్ధి చేసిన క్రాఫ్టన్ బి‌జి‌ఎం‌ఐ  రిబ్యాక్ కోసం ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. కొంతమంది గేమింగ్ కంటెంట్ క్రెయేటర్స్ BGMI వచ్చే నెలలో అంటే జనవరి 2023లో గూగుల్ ప్లే-స్టోర్‌లో తిరిగి వస్తుందని పేర్కొన్నారు. 

మీరు కూడా బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా (BGMI) ఫ్యాన్ అయితే మీకో గుడ్ న్యూస్. ఈ సంవత్సరం ప్రారంభంలో ఇండియాలో BGMI నిషేధించబడిన సంగతి మీకు తెలిసిందే. అంతకుముందు 2020లో భారత ప్రభుత్వం పబ్ జి తో సహ ఇతర మొబైల్ గేమ్స్ అండ్ యాప్స్ ని నిషేధించింది. ఇప్పుడు BGMI త్వరలో ఇండియాలోకి తిరిగి రాబోతుందని వార్తలు వస్తున్నాయి. 

నివేదిక ప్రకారం, ఈ గేమ్‌ను అభివృద్ధి చేసిన క్రాఫ్టన్ బి‌జి‌ఎం‌ఐ  రిబ్యాక్ కోసం ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. కొంతమంది గేమింగ్ కంటెంట్ క్రెయేటర్స్ BGMI వచ్చే నెలలో అంటే జనవరి 2023లో గూగుల్ ప్లే-స్టోర్‌లో తిరిగి వస్తుందని పేర్కొన్నారు. ఇంకా AFKGaming కూడా BGMI త్వరలో తిరిగి వస్తుందని పేర్కొంది.

మరొక క్రియేటర్ BGMI జనవరి 15న గూగుల్ ప్లే స్టోర్‌లోకి తిరిగి వస్తుందని పేర్కొన్నారు, అయినప్పటికీ గూగుల్ అండ్ గేమ్‌ను అభివృద్ధి చేసిన సంస్థ BGMI తిరిగి రావడంపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

డాటా సెక్యూరిటి దృశ్య  కేంద్ర ప్రభుత్వం 2020లో టిక్‌టాక్‌తో పాటు భారతదేశంలో  పబ్ జి మొబైల్ గేమ్ నిషేధించబడిన సంగతి మీకు తెలిసిందే. ఆ తర్వాత PUBG గేమ్ BGMI పేరుతో భారతదేశంలో తిరిగి వచ్చింది. మరోవైపు షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ గురించి మాట్లాడితే ఇటీవల కాలంలో అమెరికాలో కూడా నిషేధించబడింది ఇంకా అంతకు ముందు పాకిస్తాన్‌లో కూడా టిక్‌టాక్ చాలాసార్లు నిషేధించబడింది.

click me!