అసమానత్వ‘ఈ- కామర్స్‌’ పాలసీలో బ్యాలెన్స్ పాటించాలి: కట్

By rajesh yFirst Published Jan 7, 2019, 11:37 AM IST
Highlights

జాతీయ, అంతర్జాతీయ సంస్థల మధ్య సమతుల్యత పాటించేందుకు సమగ్ర జాతీయ ‘ఈ-కామర్స్’ విధానం పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని పరిశోధన సంస్థ కట్స్ (సీయూటీఎస్) ఇంటర్నేషనల్ కోరింది. వివక్షకు తక్షణ పరిష్కారం కనుక్కోవాలని కట్స్ సెక్రటరీ జనరల్ ప్రదీప్ ఎస్ మెహతా సూచించారు.

న్యూఢిల్లీ: అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ-కామర్స్‌ రంగంలో స్వదేశీ, విదేశీ సంస్థలను సమానంగా చూడాలని పరిశోధన సంస్థ కట్స్‌ (సీయూటీఎస్‌) ఇంటర్నేషనల్‌ కోరింది. సమాన వృద్ధి ఉండేలా ప్రభుత్వం సమగ్ర జాతీయ ఈ-కామర్స్‌ విధానాన్ని రూపొందించాలని సూచించింది.

సమగ్ర జాతీయ ఈ-కామర్స్ విధానం అత్యంత ఆవశ్యం
‘స్వదేశీ, విదేశీ రిటైల్‌ సంస్థల మధ్య అసమానత్వం ఇంకా పరిష్కారం కాలేదు. అందుకు సమగ్ర జాతీయ ఈ-కామర్స్‌ విధానం అత్యంత అవసరం’ అని కట్స్‌ ఇంటర్నేషనల్‌ సెక్రటరీ జనరల్‌ ప్రదీప్‌ ఎస్‌ మెహతా ఓ ప్రకటనలో తెలిపారు. విదేశీ పెట్టుబడులు గల ఆన్‌లైన్‌ రిటైల్‌ సంస్థలకు ఎఫ్‌డీఐ కొత్త మార్గదర్శకాలను ప్రభుత్వం కఠినంగా రూపొందించింది.

ఇలా అసమానత్వానికి దారి తీస్తుందన్న కట్స్
అలాంటి నిబంధనలు స్థానిక సంస్థలకు లేకపోవడం అసమానత్వానికి తావిస్తున్నాయని కట్స్‌ ఇంటర్నేషనల్‌ సెక్రటరీ జనరల్‌ ప్రదీప్‌ ఎస్‌ మెహతా  పేర్కొన్నారు. ఈ-కామర్స్‌లో వివక్షకు తక్షణ పరిష్కారం అవసరమన్నారు. ఈ రంగంలో అవినీతి, అమ్మకం దారులపై వివక్ష, భారీ రాయితీల వంటివి కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్ ఇండియా (సీసీఐ) పర్యవేక్షించాలని మెహతా కోరారు.

ఆ ఐదు సంస్థలు కొన్న విమానాలు 1,115
స్వదేశీ వైమానిక సంస్థలు 2018లో తొలిసారి వందకు పైగా విమానాలు కొనుగోలు చేయగా, అందులో సగం ఇండిగో సంస్థవే. భారత్‌లోని తొమ్మిది పెద్ద విమాన సర్వీసు సంస్థలు 120కి పైగా విమానాలు కొన్నాయి. 2017లో ఈ సంఖ్య 88 కావడం గమనార్హం. ఇక దేశవాళీ ప్రయాణికుల రద్దీ నాలుగేళ్లుగా 20 శాతం వృద్ధిరేటుతో దూసుకుపోతోంది.

విమానాల కొనుగోలులో ఇండిగో, గో ఎయిర్, ఎయిరిండియా కీలకం
ఇండిగో, గో ఎయిర్‌, ఎయిర్‌ ఇండియా, విస్తారా సంస్థలు ఎయిర్‌బస్‌ 320 నియోస్‌తోపాటు ఆరు ఇతర విమానాలు కొనుగోలు చేశాయి. ఇప్పుడు వీటి వద్ద 660కి పైగా విమానాలు ఉన్నాయి. ఇండిగో వద్ద ఏ320 నియోతోపాటు 206 విమానాలు, ఎయిర్‌ ఇండియా వద్ద 125, జెట్‌ ఎయిర్‌వేస్‌ వద్ద 124 విమానాలు ఉన్నాయి. 

వచ్చే ఐదేళ్లలో ఏటా 100 వైడ్ బాడీ, న్యారో బాడీ విమానాల కొనుగోలు
2018లో ఇండిగో ఏ321 నియోతో పాటు 55 విమానాలు కొత్తగా తీసుకున్నది. ఎయిర్‌ ఇండియా, సబ్సిడరీ సంస్థలు 18 విమానాలు, స్పైస్‌ జెట్‌ 14 విమానాలు కొనుగోలు చేశాయి.ఇండిగో, జెట్‌ ఎయిర్‌వేస్‌, స్పైస్‌జెట్‌, గో ఎయిర్‌, విస్తారా 2011 నుంచి 1,115 విమానాలు కొనుగోలు చేయడం గమనార్హం. వచ్చే ఐదేళ్ల కాలంలో ఏడాదికి 100 వైడ్‌ బాడీ, న్యారో బాడీ విమానాలను ఈ సంస్థలు కొనుగోలు చేయనున్నట్టు అంచనా.

click me!