ట్రూకాలర్‌ అద్భుతమైన ఫీచర్.. ఇప్పుడు ఆ నంబర్‌లు యాప్‌లోనే ఉంటాయి..

By asianet news teluguFirst Published Dec 7, 2022, 12:09 PM IST
Highlights

ట్రూకాలర్ విడుదల చేసిన కొత్త ఫీచర్‌ ఇండియాలోని వేరిఫైడ్ డిజిటల్ ప్రభుత్వ డైరెక్టరీ యాప్‌లో 23 కంటే ఎక్కువ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, 20 కేంద్ర మంత్రిత్వ శాఖల నంబర్లు ఉంటాయి. 

స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ ట్రూకాలర్ యూజర్లను సైబర్ క్రైమ్ నుండి రక్షించడానికి ఇంకా కొత్త ఫెసిలిటీ అందించడానికి డిజిటల్ గవర్నమెంట్ డైరెక్టరీని విడుదల చేసింది. ఈ డిజిటల్ డైరెక్టరీలో అన్ని ప్రభుత్వ శాఖలు ఇంకా అధికారుల వెరిఫైడ్ కాంటాక్ట్ నంబర్‌లు ఉంటాయి. అంటే, ఇప్పుడు ట్రూకాలర్ యూజర్లు ఈ డిజిటల్ డైరెక్టరీ సహాయంతో ప్రభుత్వ అధికారులను సులభంగా సంప్రదించవచ్చు. దీనితో పాటు యూజర్లు యాప్‌లో మినిస్ట్రీస్ అండ్ అధికారుల ఫోన్ నంబర్‌లను యాడ్ చేసే సదుపాయాన్ని కూడా పొందుతారు. అలాగే యూజర్లు వేరిఫైడ్ నంబర్‌లను కూడా గుర్తించవచ్చు. 

డిజిటల్ గవర్నమెంట్ డైరెక్టరీ
ట్రూకాలర్ విడుదల చేసిన కొత్త ఫీచర్‌ ఇండియాలోని వేరిఫైడ్ డిజిటల్ ప్రభుత్వ డైరెక్టరీ యాప్‌లో 23 కంటే ఎక్కువ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, 20 కేంద్ర మంత్రిత్వ శాఖల నంబర్లు ఉంటాయి. కంపెనీ డైరెక్టరీలో   ఈ సమాచారాన్ని ప్రభుత్వం అండ్ అధికారిక వనరుల ద్వారా చేర్చింది.

ఈ డైరెక్టరీలో ఇప్పుడు వివిధ ప్రభుత్వ శాఖలు, రాష్ట్రాలు, ప్రభుత్వ నంబర్లు కూడా  ఉంటాయని కంపెనీ తెలిపింది. జిల్లా అండ్ మునిసిపల్ స్థాయిలో కాంటాక్ట్స్ నంబర్‌లను కూడా యాడ్ చేయాలని కంపెనీ యోచిస్తోంది. 

సైబర్ నేరాలు
Truecaller వేరిఫైడ్ కాంటాక్ట్ డిజిటల్ డైరెక్టరీ సహాయంతో యూజర్లు ప్రభుత్వ అధికారులు అలాగే ఫెక్ నంబర్లను గుర్తించడంలో సహాయపడుతుంది. చాలా సార్లు స్కామర్లు ప్రభుత్వ కార్యాలయం నుండి ఫోన్ చేస్తున్నామని సాకుగా చూపుతూ మోసం చేసే సంఘటనలను చూస్తుంటాం. Truecaller ఈ కొత్త ఫీచర్‌తో యూజర్లు ఫ్రాడ్ అండ్ స్పామ్ కాల్‌లను సులభంగా గుర్తించవచ్చు.

ట్రూకాలర్ అలెర్ట్ 
ఎవరైనా ప్రభుత్వ అధికారి ఎవరికైనా కి కాల్ చేసినప్పుడు, ఆ నంబర్ గ్రీన్ బ్యాక్‌గ్రౌండ్‌లో బ్లూ టిక్‌తో కనిపిస్తుందని, తద్వారా నంబర్ వేరిఫై చేయబడిందని  యూజర్లకు సులభంగా అర్థమవుతుందని కంపెనీ తెలిపింది. మరోవైపు, స్పామ్ కాల్ వచ్చినపుడు ట్రూకాలర్‌లో రెడ్ కలర్ బ్యాక్‌గ్రౌండ్‌ కనిపిస్తుంది, దీని ద్వారా యూజర్లు అప్రమత్తంగా ఉంటారు అని వెల్లడించింది.

click me!