వెస్టిండీస్ కోచ్‌ స్టువర్ట్‌లాపై సస్పెన్షన్ వేటు

By sivanagaprasad kodatiFirst Published Oct 17, 2018, 11:23 AM IST
Highlights

అంపైర్‌ను దూషించిన వ్యవహారంపై వెస్టిండీస్ కోచ్ స్టువర్‌లాపై ఐసీసీ కన్నెర్ర చేసింది. ఆయన్ను రెండు వన్డేల్లో పాల్గొనకుండా సస్పెన్షన్ వేటు వేసింది. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఉప్పల్‌లో భారత్‌తో జరిగిన రెండో టెస్టులో బ్యాటింగ్ చేస్తోన్న కీరన్ పావెల్‌ .. అశ్విన్ బౌలింగ్‌లో రహానేకు క్యాచ్ ఇచ్చాడు. 

ఈ క్యాచ్‌పై అనుమానం ఉండటంతో థర్డ్ అంపైర్‌ సాయంతో అవుట్‌గా ప్రకటించారు ఫీల్డ్ అంపైర్లు. దీనిపై అసహనం వ్యక్తం చేసిన స్టువర్ట్ థర్డ్‌ అంపైర్ గదిలోకి దూసుకెళ్లి తీవ్రమైన పదజాలంతో దూషించాడు. అనంతరం కొందరు క్రికెటర్ల ముందే ఫోర్త్ అంపైర్‌పై కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు.

దీనిపై థర్డ్ అంపైర్ రిఫరీకి ఫిర్యాదు చేశాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఐసీసీ స్టువర్ట్ మ్యాచ్ ఫీజులో 100 శాతం కోత విధించడంతో పాటు భారత్‌తో జరిగే తొలి రెండు వన్డేలకు దూరంగా ఉండాలంటూ నిషేధం విధించింది. 

కోహ్లీ అభ్యర్థనకు ఓకే చెప్పిన బిసిసిఐ...కానీ పదిరోజుల తర్వాతే భార్యలు, గర్ల్‌ప్రెండ్స్

సచిన్ నా పేరు చెప్పగానే.. ఏడ్చేశాను.. శ్రీశాంత్

స్పాట్ ఫిక్సింగ్..లంక క్రికెట్ దిగ్గజం జయసూర్యపై ఐసీసీ యాక్షన్

పృథ్వీషాకి గంగూలీ షాక్..పంత్ కే ఓటు

2019 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల.. జూన్ 16న పాక్‌తో భారత్ ఢీ

మళ్లీ 6 బంతుల్లో 6 సిక్సులు.. యువరాజ్‌ కంటే ఒక పరుగు ఎక్కువే

బౌలింగ్ చేస్తే రక్త వాంతులు.. ఆసీస్ బౌలర్‌కు అంతుచిక్కని వ్యాధి
 
click me!