కెప్టెన్ల సవాల్: మ్యాచ్ మధ్యలో కోహ్లీ, పైన్‌ల మాటల యుద్ధం

By sivanagaprasad kodatiFirst Published Dec 17, 2018, 1:24 PM IST
Highlights

బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ఎప్పుడు జరిగినా ఆసీస్, భారత ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం జరగడం ఆనవాయితీ. గతంలో టీమిండియా కాస్త తగ్గి ఉన్నప్పటికీ.. మైదానంలో దూకుడుగా ఉంటే విరాట్ కోహ్లీ కెప్టెన్‌ అయిన తర్వాత మాటకి మాట జవాబిస్తున్నాడు. 

బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ఎప్పుడు జరిగినా ఆసీస్, భారత ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం జరగడం ఆనవాయితీ. గతంలో టీమిండియా కాస్త తగ్గి ఉన్నప్పటికీ.. మైదానంలో దూకుడుగా ఉంటే విరాట్ కోహ్లీ కెప్టెన్‌ అయిన తర్వాత మాటకి మాట జవాబిస్తున్నాడు.

తాజా ట్రోఫీ ప్రారంభానికి ముందే భారత్, ఆస్ట్రేలియా కెప్టెన్లు మాటల యుద్ధాన్ని ప్రారంభించారు. కోహ్లీని టార్గెట్ చేసిన ఆసీస్ ఆటగాళ్లు అతనిని పదే పదే రెచ్చగొడుతున్నారు. తొలి టెస్ట్‌లో తమ ఆటగాళ్లు ఔటైన తర్వాత కోహ్లీ అతి చేస్తున్నాడంటూ స్వయంగా ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్ అభ్యంతరం తెలిపాడు.

తాజాగా కెప్టెన్లిద్దరూ మ్యాచ్ మధ్యలోనే సై అంటే సై అన్నారు. పెర్త్‌లో జరుగుతున్న రెండో టెస్ట్ మూడో రోజు ఆటలో భాగంగా కోహ్లీ ఆసీస్ కెప్టెన్ టీమ్ పైన్‌ దగ్గరకు వెళ్లాడు.. ‘‘మీరు ఇలా ఆడితే సిరీస్ 2-0గా మారుతుందని’’ హెచ్చరించాడు.

దీనికి ‘‘ మీరు ముందు బ్యాటింగ్ చేయాల్సింది కదా బిగ్ హెడ్’’ పైన్ ధీటుగా బదులిచ్చాడు.  ఇవి గ్రౌండ్‌లోని స్టంప్స్ మైక్‌లో రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో అంపైర్ తప్పుడు నిర్ణయానికి బలైన విరాట్ కోహ్లీ... అసహనం వ్యక్తం చేస్తూనే పెవిలియన్‌కు చేరాడు. దీంతో అతను తన నోటికి పని చెప్పాడు. 

అక్కడ కెప్టెన్సీ చెల్లదు : భార్యకి చెప్పులు తొడిగిన ధోనీ

సారీ చెప్పి భజ్జీ ఏడ్చేశాడు: మంకీ గేట్ పై సైమండ్స్

కశ్యప్, సైనాల వెడ్డింగ్ రిసెప్షన్ (ఫొటోలు)

టెస్టుల్లో 25వ సెంచరీ బాదిన కోహ్లీ

కోహ్లీ-రహానే జోడి ఆటతీరు అద్భుతం: ఆసిస్ మాజీ కెప్టెన్ ప్రశంసలు

ఒంటి చేత్తో.. కోహ్లీ స్టన్నింగ్ క్యాచ్

పీసీబీ నుండి రూ.15 కోట్లు ఇప్పించండి : ఐసిసికి బిసిసిఐ లేఖ

కోహ్లీ టాస్ గెలిస్తే భారత్‌కు విజయమే..

click me!