షాట్లు చెత్త: బ్యాట్స్ మెన్ పై విరుచుకుపడ్డ కోహ్లీ

First Published Aug 5, 2018, 10:07 AM IST
Highlights

ఇంగ్లాండుతో జరిగిన తొలి టెస్టు ఓటమికి బ్యాట్స్ మెన్ ను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తప్పు పట్టాడు. ఐదు మ్యాచుల సిరీస్ లో భాగంగా జరిగిన తొలి టెస్టు మ్యాచులో భారత్ ఇంగ్లాండుపై 31 పరుగుల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే.  

బర్మింగ్‌హామ్‌: ఇంగ్లాండుతో జరిగిన తొలి టెస్టు ఓటమికి బ్యాట్స్ మెన్ ను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తప్పు పట్టాడు. ఐదు మ్యాచుల సిరీస్ లో భాగంగా జరిగిన తొలి టెస్టు మ్యాచులో భారత్ ఇంగ్లాండుపై 31 పరుగుల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే.  

తొలి టెస్టులో ఓటమికి బ్యాట్స్‌మెన్‌ వైఫల్యం కారణమని, తమ బ్యాట్స్ మెన్ షాట్ల ఎంపిక ఏ మాత్రం బాగా లేదని కోహ్లీ అన్నాడు. ఇదో అద్భుత మ్యాచ్‌ అని, చాలాసార్లు తాము పుంజుకోగలిగామని, కానీ ఇంగ్లండ్‌ తమను కుదురుకోనీయలేదని అన్నాడు. 

పరుగులు తీయడానికి చెమటోడ్చేలా ఇంగ్లాండు బౌలర్లు చేశారని ఆయన అన్నాడు. తమ షాట్‌ సెలెక్షన్‌లో లోపం జరిగిందిని, దీనిపై ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నాడు. 

సిరీస్‌లో ఇక ముందు ఎలా ఆడాలో ఈ మ్యాచ్‌ ద్వారా తెలిసి వచ్చిందని, ఇక జట్టు పరాజయం పాలైనప్పుడు తన సెంచరీకి ప్రాధాన్యం ఉండదని కోహ్లీ అన్నాడు. విజయానికి చేరువగా వచ్చిన భారత్ బ్యాటింగ్ వైఫల్యంతో పరాజయం పాలైన విషయం తెలిసిందే. భారత్, ఇంగ్లాండు మధ్య రెండో టెస్టు మ్యాచు లార్డ్స్ మైదానంలో ఆగస్టు 9వ తేదీన ప్రారంభం కానుంది.

click me!