తొలి టెస్టులో ఓటమి.. ఇంగ్లాండ్ బౌలర్లకు తలవంచిన భారత్

First Published Aug 4, 2018, 4:32 PM IST
Highlights

ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఓటమి పాలైంది. ఇంగ్లాండ్ నిర్ధేశించిన 194 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు ఓవర్‌నైట్ స్కోరు 110/5తో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు శుభారంభం లభించలేదు

ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఓటమి పాలైంది. ఇంగ్లాండ్ నిర్ధేశించిన 194 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు ఓవర్‌నైట్ స్కోరు 110/5తో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు శుభారంభం లభించలేదు.. భారత బ్యాట్స్‌మెన్లు చెత్త షాట్లు ఆడి ఒకరి వెంట ఒకరు పెవిలియన్‌కు క్యూకట్టారు.

37వ ఓవర్లో అండర్సన్ బౌలింగ్‌లో దినేశ్ కార్తీక్ ఔటవ్వగా.. ఆ కాసేపటికే జట్టును గెలిపిస్తాడనుకున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ వెనుదిరగ్గా.. పేస్ బౌలర్ మహ్మాద్ షమీ డకౌట్ కావడంతో భారత్ ఓటమి అంచుల్లో నిలబడింది. అయితే మరో బౌలర్ ఇషాంత్ శర్మతో కలిసి హార్డిక్ పాండ్యా  ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తుండగా.. రషీద్  బౌలింగ్‌లో ఇషాంత్ వికెట్ల ముందు దొరికిపోవడంతో భారత ఓటమి ఖాయమని అభిమానులు అంచనాకి వచ్చేశారు.

అయితే ఉమేశ్‌తో కలిసి పాండ్యా ధాటిగా ఆడుతూ కాస్త ఆశలు రేకిత్తించినప్పటికీ.. ఇంగ్లాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు.. చివరికి స్టోక్స్ బౌలింగ్‌లో కుక్‌కి క్యాచ్ ఇచ్చి హార్డిక్ పాండ్యా ముగియడంతో ఇన్నింగ్స్ 31 పరుగుల తేడాతో భారత్ పరాజయం పాలైంది.  ఈ విజయంతో 5 టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్ 5-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

click me!