అదే కొంప ముంచింది: ఓటమిపై కోహ్లీ రియాక్షన్

By pratap reddyFirst Published Jan 13, 2019, 8:34 AM IST
Highlights

శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత్‌ 34 పరుగుల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ తర్వాత కోహ్లీ మాట్లాడాడు.

సిడ్నీ: ఆస్ట్రేలియాపై తొలి వన్డేలో ఓటమిపై భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించారు. ప్రారంభంలో వరుసగా వికెట్లు కోల్పోవడం వల్ల, చివరలో రోహిత్‌కు అండ దొరకకపోవడం వల్ల ఓటమి పాలయ్యామని అతను అన్నాడు.

శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత్‌ 34 పరుగుల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ తర్వాత కోహ్లీ మాట్లాడాడు. ఈ రకమైన ఆటను తాము సమర్థించుకోమని, ఈ మ్యాచ్‌లో బంతితో బాగానే రాణించామని అనుకుంటున్నామని, 300పైగా పరుగులు వచ్చే ఈ పిచ్‌లో ప్రత్యర్థిని 288కే పరిమితం చేశామని అన్నాడు. 

బ్యాటింగ్ విషయానికి వస్తే ఆరంభంలోనే వరుసగా మూడు వికెట్లు కోల్పోవడం ఎప్పటికీ మంచిది కాదని, రోహిత్‌ అద్భుత ఆటకు ధోని మద్దతివ్వడం వల్ల తమకు విజయావకాశాలపై ఆశలు చిగురించాయని అన్నాడు. 

ధోని ఔట్‌ కావడంతో రోహిత్‌పై ఒత్తిడి పెరిగిందని, రోహిత్‌కు అండగా మరో మంచి భాగస్వామ్యం నమోదైతే విజయం దక్కేదని అన్నాడు. ఆరంభంలోనే వరుసగా వికెట్లు కోల్పోవడం  మా కొంపముంచిందని అన్నాడు.

సంబంధిత వార్తలు

రిచర్డ్స్ రికార్డును బ్రేక్ చేసిన రోహిత్ శర్మ

సచిన్ తర్వాత ఆస్థానం.. రోహిత్ శర్మదే..

సిడ్నీ వన్డే: రోహిత్ సెంచరీ వృధా...34 పరుగుల తేడాతో భారత్ ఓటమి

 

click me!