కెప్టెన్‌గా గంగూలీ సరసన కోహ్లీ

By sivanagaprasad kodatiFirst Published Dec 30, 2018, 4:43 PM IST
Highlights

ఈ ఏడాది విరాట్ కోహ్లీకి అదృష్టకాలం కొనసాగుతోంది. ఆటగాడిగా టన్నుల కొద్ది పరుగులు సాధించిన కోహ్లీ, కెప్టెన్‌గా దూసుకెళ్తున్నాడు. స్వదేశంతో పాటు విదేశాల్లో సైతం జట్టును ముందుండి నడిపిస్తూ వరుసగా సిరీస్‌లు గెలుస్తున్నాడు.

ఈ ఏడాది విరాట్ కోహ్లీకి అదృష్టకాలం కొనసాగుతోంది. ఆటగాడిగా టన్నుల కొద్ది పరుగులు సాధించిన కోహ్లీ, కెప్టెన్‌గా దూసుకెళ్తున్నాడు. స్వదేశంతో పాటు విదేశాల్లో సైతం జట్టును ముందుండి నడిపిస్తూ వరుసగా సిరీస్‌లు గెలుస్తున్నాడు.

ఈ క్రమంలో సారథిగా అరుదైన ఘనతలు తన ఖాతాలో వేసుకుంటున్నాడు. తాజాగా బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో సైతం జట్టును విజయపథాన నడిపిస్తున్నాడు. మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో గెలుపోందడం ద్వారా కోహ్లీ మరో రికార్డును అందుకున్నాడు.

విదేశాల్లో అత్యధిక టెస్టు విజయాలు సాధించిన భారత కెప్టెన్ల జాబితాలో సౌరవ్ గంగూలీతో కలిసి కోహ్లీ సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. ఇప్పటి వరకు విదేశాల్లో 24 టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించిన కోహ్లీ 11 విజయాలు సాధించాడు.

కాగా, 28 టెస్టుల్లో సారథ్యం వహించిన దాదా 11 విజయాలు సాధించాడు. మరోవైపు విదేశాల్లో అత్యధిక విజయాలు సాధించిన భారత కెప్టెన్ల జాబితాలో గంగూలీ, కోహ్లీ తర్వాత ధోనీ 6, రాహుల్ ద్రావిడ్ 5 ఉన్నారు. 
 

మెల్‌బోర్న్ టెస్టులో టీమిండియా రికార్డుల మోత

బుమ్రా దెబ్బ: ఇండియా చేతిలో ఆస్ట్రేలియా చిత్తు

వరల్డ్ కప్‌ జట్టు ఎంపికపై కోహ్లీ సూచన...వ్యతిరేకించిన ధోనీ

ఆరంగేట్ర మ్యాచ్‌లో మయాంక్ అదిరిపోయే రికార్డు...సునీల్ గవాస్కర్ తర్వాత

పైన్ పై రిషబ్ పంత్ ప్రతీకారం: వెన్నెల కిశోర్ స్పందన

అంబటి రాయుడిని చూసి భయపడిన ధోనీ

click me!