Khel Ratna and Arjuna Awards: మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు తో పాటు అర్జున అవార్డుకు పలువురు అథ్లెట్ల పేర్లను జాతీయ క్రీడా అవార్డుల కమిటీ బుధవారం నామినేట్ చేసింది.
భారత్ లో అత్యున్నత క్రీడా పురస్కారంగా భావించే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న (Major Dhyanchand Khel ratna) అవార్డు తో పాటు అర్జున (Arjuna) అవార్డుకు పలువురు అథ్లెట్ల పేర్లను జాతీయ క్రీడా అవార్డుల కమిటీ బుధవారం నామినేట్ చేసింది. ఈ జాబితాలో టోక్యో ఒలింపిక్స్ (tokyo olympics), పారాలింపిక్స్ (paralympics) లో అదరగొట్టిన క్రీడాకారులే ఎక్కువగా ఉన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.
మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు కు గాను 11 మందిని నామినేట్ చేశారు. వారు వరుసగా.. టోక్యో ఒలింపిక్స్ లో భారత స్వర్ణ పతక కాంక్ష నెరవేర్చిన నీరజ్ చోప్రా (Neeraj chopra)తో పాటు రవి దహియా (రెజ్లింగ్-రజతం), పీఆర్ శ్రీజేష్ (హాకీ- కాంస్యం), లవ్లీనా బోర్గోహైన్ (బాక్సింగ్- కాంస్యం) ఉన్నారు. వీళ్లే గాక ఈ అవార్డుకు నామినేట్ అయిన వారు..
సునీల్ ఛైత్రి (ఫుట్బాల్)
మిథాలీ రాజ్ (క్రికెట్)
ప్రమోద్ భగత్ (బ్యాడ్మింటన్)
సుమిత్ యాంటిల్ (అథ్లెటిక్స్)
అవని లేఖ (షూటింగ్)
కృష్ణా నగర్ (బ్యాడ్మింటన్)
మనీష్ నర్వాల్ (షూటింగ్) ఉన్నారు.
undefined
ఇక అర్జున అవార్డుల జాబితాలో..
యోగేష్ కథునియా (డిస్కస్ త్రో)
నిషధ్ కుమార్ (హైజంప్)
ప్రవీణ్ కుమార్ (హైజంప్)
శరద్ కుమార్ (హైజంప్)
సుహాస్ (బ్యాడ్మింటన్)
సింగ్రాజ్ అధానా (షూటింగ్)
భవినా పటేల్ (టేబుల్ టెన్నిస్)
హర్విందర్ సింగ్ (ఆర్చరీ)
శిఖర్ ధావన్ (క్రికెట్) తో పాటు మరో 26 మంది కూడా జాబితాలో ఉన్నారు.
సాధారణంగా ప్రతి ఏడాది క్రీడా అవార్డులను జాతీయ క్రీడా దినోత్సవమైన ఆగస్టు 29 (ధ్యాన్ చంద్ పుట్టినరోజు) న అందజేస్తారు. కానీ ఈసారి టోక్యో ఒలింపిక్స్ తో పాటు పారాలింపిక్స్ కూడా ఉండటంతో అవి ముగిసిన తర్వాత అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అంతకుముందే భారత ప్రభుత్వం.. రాజీవ్ గాంధీ పేరిట ఉన్న ఖేల్ రత్న అవార్డును ధ్యాన్ చంద్ గా మార్చింది.