స్వప్న స్వర్ణం వెనుక.. రాహుల్ ద్రావిడ్

By ramya neerukondaFirst Published 3, Sep 2018, 12:45 PM IST
Highlights

అదే జరిగితే నేడు భారత్‌ ఓ బంగారం లాంటి అథ్లెట్‌ను కోల్పోయేది. ఆమె ప్రతిభ గురించి తెలుసుకున్న ద్రవిడ్‌ ఆర్థికంగా చేయూతనిచ్చాడు.
 

ఏషియన్ గేమ్స్ లో హెప్టథ్లాన్‌ విభాగంలో తొలిసారిగా భారత్ స్వర్ణం గెలిచింది. ఎంతో కష్టమైన ఈ గేమ్ ని అంతే కష్టపడి సాధించింది అథ్లెట్ స్వప్న బర్మన్. నిరుపేద కుటుంబానికి చెందిన ఈ అమ్మాయి.. స్వర్ణం గెలవడంతో.. దేశం మొత్తం ఆమెను ప్రశంసిస్తోంది. అయితే.. ఈ అమ్మాయి విజయం వెనుక టీం ఇండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ ఉన్నాడనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

స్వప్న బర్మన్‌ తండ్రి ఓ రిక్షా పుల్లర్‌. ఆయనకు రెండు సార్లు గుండెపోటు రావడంతో మంచానికే పరిమితమయ్యాడు. తల్లి టీ తోటలో పనిచేపే దినసరి కూలి. ఈ పరిస్థితుల్లో స్మప్న ఆటను కొనసాగించడం కష్టమైంది. దీంతోనే ఆమె తన ఆటకు స్వస్తి చెప్పాలని నిర్ణయించుకుంది. అదే జరిగితే నేడు భారత్‌ ఓ బంగారం లాంటి అథ్లెట్‌ను కోల్పోయేది. ఆమె ప్రతిభ గురించి తెలుసుకున్న ద్రవిడ్‌ ఆర్థికంగా చేయూతనిచ్చాడు.

 ద్రవిడ్‌ మెంటార్‌ షిప్‌ కార్యక్రమం ద్వారా ఆర్థికంగానే కాకుండా మానసికంగా ధృడం అయ్యేలా శిక్షణను ఇచ్చాడు. ఆమెకే కాదు 2018 ఏషియాడ్‌లో పాల్గొన్న మరో 19 అథ్లెట్లకు ‘వాల్‌ ఆఫ్‌ క్రికెట్‌’ అనే పేరుతో ఆర్థికంగా సాయం చేసి ప్రోత్సాహించాడు. గో స్పోర్ట్స్‌ భాగస్వామ్యంతో ద్రవిడ్‌ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మారుమూల గ్రామాల్లోని క్రీడా ఆణిముత్యాల ప్రతిభను వెలకితీయడమే ఈ ప్రోగ్రాం ప్రధాన ఉద్దేశ్యం. ఇలా ఎంతో మంది అథ్లెట్లను ద్రవిడ్‌ ప్రపంచానికి పరిచయం చేశాడు.. చేస్తున్నాడు.

Last Updated 9, Sep 2018, 11:57 AM IST