కివీస్ చేతిలో ఓటమి: వన్డే చరిత్రలోనే భారత్ అరుదైన చెత్త రికార్డు

sivanagaprasad kodati |  
Published : Jan 31, 2019, 02:02 PM IST
కివీస్ చేతిలో ఓటమి: వన్డే చరిత్రలోనే భారత్ అరుదైన చెత్త రికార్డు

సారాంశం

హామిల్టన్‌లో జరిగిన నాలుగో వన్డేలో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా చిత్తు చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు వరుస విజయాలతో చారిత్రక రికార్డులు నెలకొల్పిన భారత్ ఈసారి మాత్రం తన చెత్త ప్రదర్శనతో మరో అరుదైన రికార్డును నెలకొల్పింది

హామిల్టన్‌లో జరిగిన నాలుగో వన్డేలో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా చిత్తు చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు వరుస విజయాలతో చారిత్రక రికార్డులు నెలకొల్పిన భారత్ ఈసారి మాత్రం తన చెత్త ప్రదర్శనతో మరో అరుదైన రికార్డును నెలకొల్పింది.

తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 92 పరుగులకే అలౌట్ అవ్వగా.. ఆ లక్ష్యాన్ని న్యూజిలాండ్ కేవలం 14.4 ఓవర్లలోనే చేధించింది. తద్వారా వన్డే చరిత్రలోనే బంతుల పరంగా ఘోర టీమిండియా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

212 బంతులు మిగిలి ఉండగానే ఓడిపోయింది. అంతకు ముందు 2010లో శ్రీలంకతో దంబాల్లాలో జరిగిన వన్డేలో లంక చేతిలో 209 బంతులు ఉండగానే ఓటమి చవిచూసింది. అయితే ఈ మ్యాచ్‌ వల్ల టీమిండియా ఒక రికార్డును కోల్పోయింది.

1967 నుంచి న్యూజిలాండ్ పర్యటనకు వెళుతున్న భారత్ ఇప్పటి వరకు ఒక్కసారి మాత్రమే 3-1 తేడాతో సిరీస్‌ను గెలిచింది. ఆ తర్వాత ఇంత వరకు భారత్.. కివీస్‌పై అతిపెద్ద సిరీస్ విజయాన్ని నమోదు చేయలేదు. ఇదిలా ఉంచితే ఈ సిరీస్‌లో మరో వన్డే ఉండటంతో ఆ రికార్డును అధిగమించడానికి అవకాశం ఉంది. ఐదు వన్డేల సిరీస్‌లో చివరి వన్డే ఆదివారం ఇరు జట్ల మధ్య జరగనుంది. 

అందుకే ఆయన "ది గ్రేటెస్ట్": తనపై కోప్పడినా...ధోనీపై ఖలీల్ ప్రశంసలు

టీమిండియా చెత్త ప్రదర్శనపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కామెంట్లు: అభిమానుల ఫైర్

నాలుగో వన్డే: కోహ్లీ లేని మ్యాచులో భారత్ పై కివీస్ ప్రతీకారం

హామిల్టన్ అవమానం: రోహిత్ శర్మ అప్ సెట్

 

PREV
click me!

Recommended Stories

IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !