టీమిండియా చెత్త ప్రదర్శనపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కామెంట్లు: అభిమానుల ఫైర్

By sivanagaprasad KodatiFirst Published Jan 31, 2019, 1:26 PM IST
Highlights

టీమిండియా 92 పరుగులకే అలౌటైంది. ఈ ప్రదర్శనపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ కామెంట్లు చేశాడు. ఈ మధ్యకాలంలో ఏ జట్టు కూడా 100 పరుగుల లోపు అలౌట్ అవ్వలేదని, కానీ భారత్ ఆ ఘనత సాధించిందంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. 

ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా హామిల్టన్ వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన నాలుగో వన్డేలో టీమిండియా ఘోర పరాజయం పాలవ్వడం తెలిసిందే. కివీస్ బౌలింగ్ ధాటికి భారత టాప్ ఆర్డర్ పేకమేడలా కూలిపోయింది. 50కే చాపచుట్టేస్తారేమో అన్న దశలో చాహల్, కుల్‌దీప్ పోరాటం చేసి కాస్తయినా పరువు దక్కించారు.

ముఖ్యంగా బౌల్ట్, గాండ్ర హోమ్మీలు భారత్ నడ్డి విరిచారు. వీరి విజృంభణతో టీమిండియా 92 పరుగులకే అలౌటైంది. ఈ ప్రదర్శనపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ కామెంట్లు చేశాడు. ఈ మధ్యకాలంలో ఏ జట్టు కూడా 100 పరుగుల లోపు అలౌట్ అవ్వలేదని, కానీ భారత్ ఆ ఘనత సాధించిందంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు.

దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన భారత అభిమానులు వెంటనే వాన్‌ను టార్గెట్ చేస్తూ ట్వీట్టర్‌లో ట్రోల్ చేశారు. ‘‘ వారం క్రితం వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 77 పరుగులకే అలౌటైన సంగతి గుర్తు లేదా’’ అంటూ చురకలు అంటించారు.

77 కంటే 92 ఎక్కువేనన్నారు. ‘‘ కోహ్లీ, ధోనీ లాంటి సూపర్‌స్టార్ లేకుండా బరిలోకి దిగిన 3వ ర్యాంక్‌లో ఉన్న న్యూజిలాండ్ చేతిలో 92 కే అలౌట్ అవ్వడం భారత్‌కు గర్వకారణమేనని, కానీ శత్రు దుర్భేధ్యంగా ఉన్న ఇంగ్లీష్ జట్టు 8వ స్థానంలో ఉన్న చివరనున్న వెస్టిండీస్ ‌చేతిలో 77 అలౌట్ అవ్వడం సిగ్గు చేటన్నారు.
 

నాలుగో వన్డే: కోహ్లీ లేని మ్యాచులో భారత్ పై కివీస్ ప్రతీకారం

హామిల్టన్ అవమానం: రోహిత్ శర్మ అప్ సెట్

click me!