మహిళలు సైతం.. న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం

sivanagaprasad kodati |  
Published : Jan 24, 2019, 02:39 PM IST
మహిళలు సైతం.. న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం

సారాంశం

ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా నేపియర్‌‌లో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. పురుషుల కన్నా తాము తక్కువేం తినలేదన్నట్లు టీమిండియా మహిళా జట్టు సైతం కివీస్‌ను ఓడించింది.

ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా నేపియర్‌‌లో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. పురుషుల కన్నా తాము తక్కువేం తినలేదన్నట్లు టీమిండియా మహిళా జట్టు సైతం కివీస్‌ను ఓడించింది.

నేపియర్ వేదికగా జరిగిన ఇవాళ జరిగిన తొలి వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది... కివీస్‌కు ఆ జట్టు ఓపెనర్లు సుజీ బేట్స్, సోఫీ డివైన్‌లు శుభారంభాన్ని అందించారు.

ఆ తర్వాత వరుసపెట్టి న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్లు పెవిలియన్ చేరడంతో 48.4 ఓవర్లలో ఆ జట్టు 192 పరుగులకు అలౌటైంది. భారత బౌలర్లలో ఏక్తాబిస్, పూనమ్ యాదవ్‌లు తలో మూడు వికెట్లు తీసి న్యూజిలాండ్ నడ్డివిరిచారు.

లక్ష్యాన్ని భారత్ ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఓపెనర్ సృతీ మంథాన 105 పరుగులతో పాటు మరో ఓపెనర్ జమీమా రోడ్రిగ్స్‌ 81 పరుగులు చేసి విజయానికి బాటలు వేశారు. విజయానికి 3 పరుగుల దూరంలో సృతీ ఔటైనా రోడ్రిగ్స్ లాంఛనాన్ని పూర్తి చేసింది. 

కివీస్ తో వన్డే, టీ20 సిరీస్ లు: కోహ్లీ ఔట్, రోహిత్ కు సారథ్యం

‘‘ఏయ్ నల్లోడా.. మీ అమ్మ’’ అంటూ పాక్ కెప్టెన్ వివాదాస్పద వ్యాఖ్యలు

గెలుపు సంబరాలు... మైదానంలో సరికొత్త వాహనంపై కోహ్లీ, ధోని చక్కర్లు (వీడియో)

క్రికెట్ కి గుడ్ బై చెప్పిన మాజీ ఆల్ రౌండర్

కోహ్లీ నాతో విబేధించాడు: చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే

టాప్ టెన్‌లో చేరిన కోహ్లీ...క్రికెట్ దిగ్గజం లారాను వెనక్కినెట్టి

PREV
click me!

Recommended Stories

IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !