నాలుగో టెస్ట్: లంచ్ సమయానికి సెంచరీ కొట్టిన టీంఇండియా

By Arun Kumar PFirst Published Aug 31, 2018, 6:21 PM IST
Highlights

ఇంగ్లాండ్ వేధికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ లో టీం ఇండియా సంయమనంతో బ్యాటింగ్ చేస్తోంది. ఇప్పటికే ఓపెనర్ల వికెట్లు కోల్పోవడంతో క్రీజులో ఉన్న ఆటగాళ్లు జాగ్రత్తగా ఆడుతున్నారు. దీంతో లంచ్ విరామానికి టీం ఇండియా 31 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి వంద పరుగులు చేసింంది. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ విరాట్ కోహ్లీ( 40 బంతుల్లో 25 పరుగులు), చటేశ్వర్ పుజారా( 69 బంతుల్లో 25 పరుగులు) ఉన్నారు. వీరిద్దరు నిలకడగా ఆడుతూ చక్కటి బాగస్వామం నమోదు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. 

19 పరుగులు ఓవర్ నైట్ స్కోరు వద్ద ఇవాళ బ్యాటింగ్ చేపట్టిన టీం ఇండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. మొదట ఓపెనర్ లోకేశ్ రాహుల్ (19 వ్యక్తిగత పరుగులు) అవుటవగా ఆ తర్వాత మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (23 పరుగులు) కూడా ఫెవిలియన్ బాట పట్టాడు. దీంతో 67 పరుగులకే టీంఇండియా రెండు వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో కెప్టెన్ కోహ్లీ, పుజారా లు సమయోచితంగా ఆడుతూ మరో వికెట్ పడకుండా అడ్డుకున్నారు. దీంతో స్కోరు లంచ్ విరామానికి సెంచరీకి చేరుకుంది.

అయితే ఇంగ్లాండ్ బౌలర్ బ్రాడ్ అద్భుతమైన బంతులతో భారత బ్యాట్ మెన్స్ ని ముప్పుతిప్పలు పెడుతున్నాడు. టీం ఇండియా ఇద్దరు ఓపెనర్లు ఇతడి బౌలింగ్ లోనే ఔటయ్యారు.
 
సంబంధిత వార్తల కోసం కింది లింక్స్ పై క్లిక్ చేయండి

నాలుగో టెస్ట్: బ్రాడ్ దాటికి రెండో వికెట్ కోల్పోయిన భారత్

విరాట్ కెప్టెన్సీలో టీం ఇండియా మొదటిసారి...నాలుగో టెస్ట్‌లో అరుదైన రికార్డు

ఆదుకున్న కరాన్: 246 పరుగులకు ఇంగ్లాండు ఆలౌట్

click me!