డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు.. క్రికెటర్ అరెస్ట్

By ramya NFirst Published Apr 1, 2019, 12:59 PM IST
Highlights

పీకలదాకా మద్యం తాగి... వాహనం నడుపుతూ పోలీసులకు అడ్డంకా బుక్కయ్యాడు ఓ క్రికెటర్.  

పీకలదాకా మద్యం తాగి... వాహనం నడుపుతూ పోలీసులకు అడ్డంకా బుక్కయ్యాడు ఓ క్రికెటర్.  టీం శ్రీకలంక కెప్టెన్ దిముత్ కరుణారతనే డ్రంక్ అండ్ డ్రైవ్ లో అరెస్టు అయ్యారు. ఆదివారం ఆయన మద్యం తాగి.. వాహనం నడుపుతూ యాక్సిడెంట్ చేశారు. ఈ క్రమంలో ఒకరు తీవ్రగాయాలపాలయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కరుణారతన్ ని అరెస్టు చేశారు.

కాగా.. ఆయనకు వెంటనే బెయిల్ మంజూరు అయ్యిందని పోలీసులు చెప్పారు. సోమవారం ఆయనను కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు ఆయనపై ఇలాంటి కేసు నమోదు కావడం ఇదే తొలసారి. ఈ విషయం గురించి స్పందిచడానికి ఇష్టపడలేదని తెలుస్తోంది. కాగా.. కరుణాతరన్ ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి లీగల్ ప్రాసెస్ లో బిజీగా ఉన్నారు.

కెప్టెన్ గా కరుణారతనేకి మంచి పేరు ఉంది. ఆయన సారథ్యంలో శ్రీలంక జట్టు గత నెలలో దక్షిణాఫ్రికా జట్టు మీద రెండు టెస్టు సిరీస్ లు కైవసం చేసుకుంది. ఆఫ్రికా నేషన్ లో టెస్ట్ సిరీస్ గెలిచిన తొలి ఏషియన్ టీంగా కరుణారతనే సారథ్యం వహించిన శ్రీలంక జట్టు నిలిచింది. ఈయన ఇప్పటి వరకు 60 టెస్టు మ్యాచ్ లు ఆడారు.
 

click me!