Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్ లో ఫైన‌ల్లోకి భారత స్టార్ షూటర్.. ఎవరీ మ‌ను భాక‌ర్?

By Mahesh Rajamoni  |  First Published Jul 27, 2024, 6:06 PM IST

Paris Olympics 2024 :  పారిస్ ఒలింపిక్స్ 2024లో భార‌త స్టార్ షూట‌ర్ మ‌ను భాక‌ర్ భార‌త్ కు తొలి ప‌త‌కం అందించ‌డానికి మ‌రో ముంద‌డుగు వేశారు. 
 


Who is Manu Bhaker: భార‌త షూట‌ర్ మ‌ను భాక‌ర్ పారిస్ ఒలింపిక్స్ 2024 లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఫైన‌ల్ చేరుకున్నారు. క్వాలిఫైయింగ్ రౌండ్‌లో మూడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. 580 స్కోర్ తో మను భాక‌ర్ మూడో స్థానంలో ఉండ‌గా, త‌న‌కంటే ముందు దక్షిణ కొరియాకు చెందిన‌ ఓహ్ యే జిన్ 582 స్కోర్ తో రెండు స్థానంలో ఉన్నారు. తొలి స్థానంలో ఉన్న హంగేరీకి చెందిన మేజర్ వెరోనికా కూడా 582 స్కోర్ ను సాధించారు. ఇదే విభాగంలో పోటీప‌డ్డ‌ మ‌రో భార‌త షూట‌ర్ రిథమ్ సాంగ్వాన్ 573 స్కోర్ తో 15వ స్థానంలో నిలిచింది. అయితే, టాప్ 8 ఆటగాళ్లకు మాత్రమే ఫైనల్‌లో చోటుద‌క్కుతుంది. 

 

🇮🇳Update: 10M AIR PISTOL WOMEN'S QUALIFICATION Results 👇🏼

- finished 3rd with a score of 580
- finished 15th with a total score of 573

Manu Bhaker qualified for the finals, also shooting the highest number of Perfect Scores (27). pic.twitter.com/OyD3tqeOkQ

— SAI Media (@Media_SAI)

Latest Videos

undefined

 

ఎవ‌రీ మ‌ను భాక‌ర్? 

భార‌త స్టార్ షూట‌ర్ల‌లో మ‌ను భాక‌ర్ ఒక‌రు. యుక్తవయసులోనే అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో త‌క్కువ కాలంలోనే షూటింగ్ స్టార్‌గా త‌న‌ ర్యాంక్‌లను పెంచుకున్నారు. బాక్సర్లు, రెజ్లర్‌లకు పేరుగాంచిన హర్యానాలోని ఝజ్జర్‌లో జన్మించిన మను భాకర్ పాఠశాలలో టెన్నిస్, స్కేటింగ్, బాక్సింగ్ వంటి క్రీడలను ఎంచుకున్నారు. ఆమె 'తంగ్ టా' అనే మార్షల్ ఆర్ట్స్‌లో పాల్గొని జాతీయ స్థాయిలో పతకాలు సాధించింది.

2016 రియో ​​ఒలింపిక్స్ ముగిసిన తర్వాత త‌న‌ 14 సంవత్సరాల వయస్సులో షూటింగ్‌లోకి మారింది. ఒక వారంలోపు మను భాకర్ తన నైపుణ్యాన్ని పెంచుకోవ‌డానికి స్పోర్ట్స్ షూటింగ్ పిస్టల్‌ని తీసుకురావాలని ఆమె తండ్రిని కోరింది. ఆమెకు ఎప్పుడూ మద్దతునిచ్చే తండ్రి రామ్ కిషన్ భాకర్ ఆమెకు స్పోర్ట్స్ షూటింగ్ పిస్టల్‌ని కొనిచ్చాడు. ఏదో ఒక రోజు మ‌ను భాక‌ర్ ను ఈ పిస్ట‌ల్ ఒలింపిక్ ఛాంపియ‌న్ గా మారుస్తుంద‌ని ఆకాంక్షించారు. 

అత్యంత ఖరీదైన టాప్-5 ఒలింపిక్స్ ఇవే..

త‌న తండ్రి క‌ల‌ల‌ను నిజం చేస్తూ మ‌ను భాక‌ర్ అతి త‌క్కువ కాలంలోనే స్టార్ షూట‌ర్ గా ఎదిగారు. 2017 జాతీయ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో మను భాకర్ ఒలింపియన్, మాజీ ప్రపంచ నంబర్ 1 హీనా సిద్ధూకు షాకిచ్చారు. మను భాక‌ర్ 242.3 రికార్డు స్కోరుతో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో సిద్ధూ సాధించిన మార్కును అధిగమించారు. ఆ తర్వాత 2017 ఆసియా జూనియర్ ఛాంపియన్‌షిప్‌లలో రజత పతకాన్ని గెలుచుకుంది. ఇప్పుడు రెండోసారి ఒలింపిక్ వేదిక‌పై పోటీ ప‌డుతోంది.

 

In this segment of , meet India's shooting sensation Manu Bhaker🔫☑️

The first Indian🇮🇳 female shooter to win a gold🥇 at 2⃣0⃣1⃣8⃣ has multiple records to her name. pic.twitter.com/uZ8EPd4Tbd

— SAI Media (@Media_SAI)

 

PARIS OLYMPICS 2024 : నిరాశప‌ర్చిన భార‌త ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్.. తొలి గోల్డ్ కొట్టిన చైనా

click me!