అరంగేట్రంలో అత్య‌ధిక వికెట్ల రికార్డు బ‌ద్ద‌లు.. ఎవ‌రీ డెడ్లీ బౌల‌ర్?

By Mahesh Rajamoni  |  First Published Jul 23, 2024, 10:49 PM IST

Charlie Cassell : అంత‌ర్జాతీయ క్రికెట్ లోకి మ‌రో డెడ్లీ బౌల‌ర్ ఎంట్రీ ఇచ్చాడు. త‌న తొలి మ్యాచ్ లోనే సూప‌ర్ బౌలింగ్ తో 9 ఏండ్ల రికార్డును బద్ద‌లు కొట్టాడు. ఐసీసీ క్రికెట్‌ వరల్డ్‌కప్‌ లీగ్‌ 2లో భాగంగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో స్కాటిష్ ఫాస్ట్ బౌల‌ర్ చార్లీ కాసెల్ ఏకంగా  7 వికెట్లు తీశాడు. 
 


Scotland Cricket Team - Charlie Cassell : ఇప్పటి వరకు ఎన్నో రికార్డులు సృష్టించడం, బద్దలు కొట్టడం అంత‌ర్జాతీయ క్రికెట్ లో చూశాం. ఇప్పుడు అలాంటి మ‌రో అద్భుత‌మైన రికార్డును బ‌ద్ద‌లు కొడుతూ ఒక డెడ్లీ బౌల‌ర్ అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. త‌న తొలి మ్యాచ్ లోనే అద్భుత‌మైన బౌలింగ్ తో వ‌రుస‌గా వికెట్లు ప‌డ‌గొడుతూ రికార్డుల మోత మోగించాడు. అత‌నే స్కాటిష్ ఫాస్ట్ బౌలర్ చార్లీ కాసెల్. క్రికెట్ ప్ర‌పంచానికి ఇప్ప‌టివ‌ర‌కు ఈ పేరు గురించి పెద్ద‌గా ప‌రిచయం లేదు కానీ, త‌న తొలి మ్యాచ్ తోనే అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు. అరంగేట్రంలోనే ద‌క్షిణాఫ్రికా స్టార్ బౌల‌ర్ కగిసో రబాడా రికార్డును బద్దలు కొట్టాడు.

ఐసీసీ పురుషుల క్రికెట్ వన్డే ప్రపంచకప్ లీగ్ 2లో భాగంగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్ పేసర్ చార్లీ కాసెల్ ఏడు వికెట్లు తీసుకున్నాడు. ఇత‌నికి ఇది అరంగేట్రం మ్యాచ్ కావ‌డం విశేషం. త‌న తొలి వ‌న్డే మ్యాచ్ లోకేవలం 5.4 ఓవర్ల బౌలింగ్ లో 21 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి 7 వికెట్లు తీసుకున్నాడు. దీంతో వన్డే అరంగేట్రంలోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డు సృష్టించాడు. అత‌ని కంటే ముందు 2016లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే  అరంగేట్రం మ్యాచ్ లో దక్షిణాఫ్రికా ఆటగాడు కగిసో రబడ పేరు మీద ఈ రికార్డు ఉండేది. అత‌ను త‌న తొలి వ‌న్డే మ్యాచ్ లో కేవ‌లం 22 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి 6 వికెట్లు తీసుకున్నాడు. ర‌బడతో పాటు వెస్టిండీస్ పేసర్ ఫిడెల్ ఎడ్వర్డ్స్ కూడా తన వ‌న్డే అరంగేట్రంలో 16 ప‌రుగులు ఇచ్చి 6 వికెట్లు సాధించాడు. 

Latest Videos

undefined

ఆసియా క‌ప్ : సెమీస్ చేరిన టీమిండియా.. ఒకేఒక్క జ‌ట్టుగా స‌రికొత్త రికార్డు

కాగా, ప్ర‌స్తుత మ్యాచ్ లో చార్లీ కాసెల్ సూప‌ర్ బౌలింగ్ దెబ్బ‌కు ఒమన్‌ 91 పరుగులకే ఆలౌట్ అయింది. స్కాట్‌లాండ్‌ 17.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మ్యాచ్ 12వ ఓవర్లో బౌలింగ్ చేయడానికి వచ్చిన పేసర్ కాసెల్ తాను వేసిన మొదటి రెండు బంతుల్లో వికెట్లు తీశాడు. అయితే అతను హ్యాట్రిక్ మిస్  అయ్యాడు కానీ, ఓవర్ నాలుగో బంతికి మ‌రో వికెట్ తీశాడు. త‌న తొలి ఓవ‌ర్ లోనే జిషాన్ మక్సూద్, అయాన్ ఖాన్, ఖలీద్ కైల్‌లను అవుట్ చేస్తూ మూడు వికెట్లు తీసుకున్నాడు. వన్డేల్లో తన మొదటి ఓవర్ లో మూడు వికెట్లు తీసుకోవ‌డంతో పాటు దానిని మెయిడిన్‌గా పూర్తి చేశాడు.

 

5️⃣.4️⃣ overs
1️⃣ maiden
2️⃣1️⃣ runs
7️⃣ wickets

Charlie Cassell with the 𝘽𝙀𝙎𝙏 𝙀𝙑𝙀𝙍 figures on ODI debut 🤯🤩🔥 pic.twitter.com/EXSw7ixucZ

— Cricket Scotland (@CricketScotland)

 

Paris Olympics : ఒకటి కాదు.. రెండు దేశాల‌కు 'ఒలింపిక్ గోల్డ్ మెడ‌ల్స్' అందించిన ఈ అథ్లెట్లు తెలుసా?

 

click me!