Indian Olympics Schedule 2024: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత తరఫున 100 మందికి పైగా అథ్లెట్లు పాల్గొంటున్నారు. టోక్యో 2020తో పోలిస్తే ఈ సారి భారత్ మరిన్ని ఎక్కువ పతకాలు సాధిస్తుందని ఆశాభావంతో ఉంది. పారిస్ ఒలింపిక్స్ లో భారత్ షెడ్యూల్ ఇలా ఉంది..
Paris Olympics 2024-Indian schedule, Date, Fixtures : జూలై 26 నుంచి ప్రారంభం కానున్న పారిస్ క్రీడల్లో సత్తా చాటేందుకు సిద్ధమైంది భారత్. ఈ సారి గతంలో కంటే అధికంగా గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవలి కాలంలో ఒలింపిక్స్ లో భారత్ ప్రదర్శన నిలకడగా మెరుగుపడుతోంది. టోక్యో 2020లో జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా స్వర్ణం సహా ఏడు పతకాలతో భారత్ చారిత్రాత్మక మైలురాయిని సాధించింది. ప్రతిష్టాత్మక గ్లోబల్ స్పోర్ట్స్ ఈవెంట్ లో భారత్ అత్యంత విజయవంతమైన ప్రదర్శనగా చెప్పవచ్చు. అయితే, ఈ ఏడాది 100 మందికి పైగా అథ్లెట్లు పాల్గొంటున్న నేపథ్యంలో పారిస్ ఒలింపిక్స్ లో భారత్ మరిన్ని పతకాలు సాధిస్తుందని ఆశాభావంతో ఉంది. జులై 26న అధికారికంగా ఒలింపిక్స్ ప్రారంభం కానున్నప్పటికీ వ్యక్తిగత ర్యాంకింగ్ రౌండ్లలో ఆర్చర్లు పోటీపడటంతో భారత్ పోరు ఒక రోజు ముందుగానే ప్రారంభం కానుంది.
జూలై 25, గురువారం
ఆర్చరీ - మహిళల వ్యక్తిగత ర్యాంకింగ్ రౌండ్ (1 pm), పురుషుల వ్యక్తిగత ర్యాంకింగ్ రౌండ్
జూలై 26, శుక్రవారం
పారిస్ ఒలింపిక్స్ 2024 ప్రారంభ వేడుకలు
జూలై 27, శనివారం
హాకీ - భారత్ vs న్యూజిలాండ్
బ్యాడ్మింటన్ - పురుషుల సింగిల్స్ గ్రూప్ స్టేజ్, మహిళల సింగిల్స్ గ్రూప్ స్టేజ్, పురుషుల డబుల్స్ గ్రూప్ స్టేజ్, మహిళల డబుల్స్ గ్రూప్ స్టేజ్
బాక్సింగ్ - ప్రిలిమ్స్ రౌండ్ ఆఫ్ 32 రోయింగ్- పురుషుల సింగిల్ స్కల్స్ హిట్స్
షూటింగ్ - 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ క్వాలిఫై, 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మెడల్ మ్యాచ్‌లు, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫై, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫై
టేబుల్ టెన్నిస్ - పురుషుల & మహిళల సింగిల్స్ ప్రిలిమ్స్, రౌండ్ ఆఫ్ 64 టెన్నిస్ – 1వ రౌండ్ మ్యాచ్‌లు – పురుషుల సింగిల్స్, మహిళల సింగిల్స్, పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్
జూలై 28, ఆదివారం
ఆర్చరీ - మహిళల టీమ్ రౌండ్ ఆఫ్ 16 నుంచి ఫైనల్స్ వరకు
రోయింగ్ - పురుషుల సింగిల్ స్కల్స్ రెపెచేజ్ రౌండ్
షూటింగ్ – 10మీ ఎయిర్ రైఫిల్ ఉమెన్స్ క్వాలిఫికేషన్, 10మీ ఎయిర్ పిస్టల్ పురుషుల ఫైనల్, 10మీ ఎయిర్ రైఫిల్ మెన్స్ క్వాలిఫికేషన్, 10మీ ఎయిర్ పిస్టల్ ఉమెన్స్ ఫైనల్
స్విమ్మింగ్ – పురుషుల 100మీ బ్యాక్‌స్ట్రోక్ హీట్స్, పురుషుల 100మీ బ్యాక్‌స్ట్రోక్ సెమీ-ఫైనల్, మహిళల 200మీ ఫ్రీస్టైల్ హీట్స్, మహిళల 200మీ ఫ్రీస్టైల్ సెమీ-ఫైనల్
జూలై 29, సోమవారం
ఆర్చరీ – పురుషుల టీమ్ రౌండ్ ఆఫ్ 16 నుండి ఫైనల్స్ వరకు
హాకీ – ఇండియా vs అర్జెంటీనా (సాయంత్రం 4:15 గంటలకు)
రోయింగ్ – పురుషుల సింగిల్ స్కల్స్ సెమీ-ఫైనల్ E/F
షూటింగ్ – ట్రాప్ పురుషుల అర్హత, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ క్వాలిఫై, 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మహిళల ఫైనల్, 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పురుషుల ఫైనల్
స్విమ్మింగ్ – పురుషుల 100మీ బ్యాక్‌స్ట్రోక్ ఫైనల్, మహిళల 200మీ ఫ్రీస్టైల్ ఫైనల్
టేబుల్ టెన్నిస్ – పురుషుల & మహిళల సింగిల్స్- రౌండ్ ఆఫ్ 64 & రౌండ్ ఆఫ్ 32 టెన్నిస్- 2వ రౌండ్ మ్యాచ్‌లు
జూలై 30, మంగళవారం
ఆర్చరీ – మహిళల వ్యక్తిగత రౌండ్ 64, రౌండ్ ఆఫ్ 32, పురుషుల వ్యక్తిగత రౌండ్ 64, రౌండ్ ఆఫ్ 32
ఈక్వెస్ట్రియన్ - డ్రస్సేజ్ ఇండివిజువల్ డే 1
హాకీ - ఇండియా vs ఐర్లాండ్ - సాయంత్రం 4:45 గంటలకు
రోయింగ్ – పురుషుల సింగిల్ స్కల్స్ క్వార్టర్ ఫైనల్స్
షూటింగ్ – ట్రాప్ ఉమెన్స్ క్వాలిఫికేషన్ – డే 1, 10మీ ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ మెడల్ మ్యాచ్‌లు, ట్రాప్ మెన్స్ ఫైనల్
టెన్నిస్ - రౌండ్ 3 మ్యాచ్‌లు
జూలై 31, బుధవారం
బాక్సింగ్ - క్వార్టర్ ఫైనల్స్
ఈక్వెస్ట్రియన్ - డ్రస్సేజ్ ఇండివిజువల్ డే 2
రోయింగ్ - పురుషుల సింగిల్ స్కల్స్ సెమీ-ఫైనల్
షూటింగ్ - 50 మీ రైఫిల్ 3 Pos. పురుషుల క్వాలిఫికేషన్, ట్రాప్ ఉమెన్స్ ఫైనల్
టేబుల్ టెన్నిస్ - రౌండ్ ఆఫ్ 16
టెన్నిస్ - పురుషుల డబుల్స్ సెమీ-ఫైనల్
అన్నింటిలోనూ ఛాంపియన్.. కోహ్లీ కంటే రోహిత్ ను క్రికెటర్లు ఎక్కువ ఇష్టపడేది అందుకే.. !
ఆగష్టు 1, గురువారం
అథ్లెటిక్స్ - పురుషుల 20 కి.మీ రేస్ వాక్, మహిళల 20 కి.మీ రేస్ వాక్ (ఉదయం 11 గంటల నుండి)
బ్యాడ్మింటన్ - పురుషుల & మహిళల డబుల్స్ క్వార్టర్-ఫైనల్, పురుషుల & మహిళల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 16
హాకీ - ఇండియా v బెల్జియం – 1:30 pm, గోల్ఫ్ – పురుషుల రౌండ్ 1
జూడో - మహిళల 78+ కిలోల రౌండ్ ఆఫ్ 32 నుండి ఫైనల్స్ వరకు
రోయింగ్ - పురుషుల సింగిల్ స్కల్స్ సెమీ-ఫైనల్ A/B
సెయిలింగ్ - పురుషుల & మహిళల డింగీ రేస్ 1-10
షూటింగ్ - 50మీ రైఫిల్ 3 స్థానాలు పురుషుల ఫైనల్, 50మీ రైఫిల్ 3 Pos. మహిళల క్వాలిఫయింగ్.
టేబుల్ టెన్నిస్ – పురుషుల & మహిళల సింగిల్స్ క్వార్టర్-ఫైనల్
టెన్నిస్ - పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్
2 ఆగస్టు, శుక్రవారం
ఆర్చరీ - మిక్స్‌డ్ టీమ్ రౌండ్ ఆఫ్ 16 నుండి ఫైనల్స్ వరకు
అథ్లెటిక్స్ - పురుషుల షాట్ పుట్ క్వాలిఫయింగ్
బ్యాడ్మింటన్ - మహిళల డబుల్స్ సెమీ-ఫైనల్, పురుషుల డబుల్స్ సెమీ-ఫైనల్, పురుషుల సింగిల్స్ క్వార్టర్-ఫైనల్
హాకీ - ఇండియా vs ఆస్ట్రేలియా - సాయంత్రం 4:45 గంటలకు
గోల్ఫ్ - పురుషుల రౌండ్ 2 రోయింగ్- పురుషుల సింగిల్ స్కల్స్ ఫైనల్స్
షూటింగ్ - స్కీట్ పురుషుల క్వాలిఫయింగ్. డే 1, 25 మీ పిస్టల్ మహిళల క్వాలిఫైయర్స్, 50 మీ రైఫిల్ 3 స్థానాలు మహిళల ఫైనల్
టేబుల్ టెన్నిస్ – పురుషుల & మహిళల సింగిల్స్ సెమీ-ఫైనల్
టెన్నిస్ – పురుషుల సింగిల్స్ సెమీ-ఫైనల్, పురుషుల డబుల్స్ ఫైనల్ మ్యాచ్‌లు
ఆగస్టు 3, శనివారం
ఆర్చరీ - మహిళల వ్యక్తిగత రౌండ్ 16 నుండి ఫైనల్స్ వరకు
అథ్లెటిక్స్ - పురుషుల షాట్ పుట్ ఫైనల్
బ్యాడ్మింటన్ - మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్, మహిళల డబుల్స్ మెడల్ మ్యాచ్‌లు
బాక్సింగ్ - క్వార్టర్ ఫైనల్స్, మహిళల 60 కేజీలు - సెమీ ఫైనల్
గోల్ఫ్ - పురుషుల రౌండ్ 3
షూటింగ్ - స్కీట్ పురుషుల క్వాలిఫికేషన్ – డే 2, స్కీట్ ఉమెన్స్ క్వాలిఫికేషన్ – డే 1, 25 మీ పిస్టల్ ఉమెన్స్ ఫైనల్ – స్కీట్ మెన్స్ ఫైనల్
టేబుల్ టెన్నిస్ - మహిళల సింగిల్స్ మెడల్ మ్యాచ్‌లు
టెన్నిస్ - పురుషుల సింగిల్స్ మెడల్ మ్యాచ్‌లు
Paris Olympics 2024 లో పాల్గొంటున్న భారత క్రీడాకారులు వీరే
ఆగస్టు 4, ఆదివారం
ఆర్చరీ - పురుషుల వ్యక్తిగత రౌండ్ 16 నుండి ఫైనల్స్ వరకు
అథ్లెటిక్స్ - మహిళల 3000మీ స్టీపుల్‌చేజ్ రౌండ్ 1 (1:35 pm), పురుషుల లాంగ్ జంప్ అర్హత
బ్యాడ్మింటన్ - మహిళల సింగిల్స్ సెమీ-ఫైనల్, పురుషుల సింగిల్స్ సెమీ-ఫైనల్, పురుషుల డబుల్స్ మెడల్ మ్యాచ్‌లు
బాక్సింగ్ - సెమీ-ఫైనల్
ఈక్వెస్ట్రియన్ - డ్రస్సేజ్ ఇండివిజువల్ గ్రాండ్ ప్రిక్స్ ఫ్రీస్టైల్
హాకీ – పురుషుల క్వార్టర్ ఫైనల్స్ గోల్ఫ్- పురుషుల రౌండ్ 4
షూటింగ్ - 25మీ ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ పురుషుల క్వాల్-స్టేజ్ 1, స్కీట్ ఉమెన్స్ క్వాలిఫికేషన్ – డే 2, స్కీట్ ఉమెన్స్ ఫైనల్
టేబుల్ టెన్నిస్ - పురుషుల సింగిల్స్ మెడల్ మ్యాచ్‌లు
ఆగస్టు 5, సోమవారం
అథ్లెటిక్స్ - పురుషుల 3000m స్టీపుల్‌చేజ్ రౌండ్ 1, మహిళల 5000m ఫైనల్
బ్యాడ్మింటన్ - మహిళల సింగిల్స్ మెడల్ మ్యాచ్‌లు), పురుషుల సింగిల్స్ మెడల్ మ్యాచ్‌లు
షూటింగ్ - స్కీట్ మిక్స్‌డ్ టీమ్ క్వాలిఫికేషన్, 25మీ ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ పురుషుల ఫైనల్, స్కీట్ మిక్స్‌డ్ టీమ్ మెడల్ మ్యాచ్
టేబుల్ టెన్నిస్ - పురుషుల & మహిళల టీమ్ రౌండ్ ఆఫ్ 16
రెజ్లింగ్ - మహిళల 68 కిలోల రౌండ్ ఆఫ్ 16 & క్వార్టర్-ఫైనల్
ఆగస్టు 6, మంగళవారం
అథ్లెటిక్స్ - పురుషుల జావెలిన్ త్రో అర్హత, మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ ఫైనల్, పురుషుల లాంగ్ జంప్ ఫైనల్
బాక్సింగ్ - సెమీ-ఫైనల్, మహిళల 60 కిలోలు - ఫైనల్
హాకీ - పురుషుల సెమీ-ఫైనల్
సెయిలింగ్ - పురుషుల & మహిళల డింగీ ఫైనల్
టేబుల్ టెన్నిస్ - పురుషుల & మహిళల టీమ్ క్వార్టర్-ఫైనల్
రెజ్లింగ్ - మహిళల 68 కిలోల సెమీ-ఫైనల్ టు మెడల్ మ్యాచ్‌లు, మహిళల 50 కిలోల రౌండ్ ఆఫ్ 16 & క్వార్టర్-ఫైనల్
ఆగస్టు 7, బుధవారం
అథ్లెటిక్స్ – పురుషుల 3000మీ స్టీపుల్‌చేజ్ ఫైనల్, మారథాన్ రేస్ వాక్ మిక్స్‌డ్ రిలే, మహిళల 100మీ హర్డిల్స్ రౌండ్ 1, మహిళల
జావెలిన్ త్రో క్వాలిఫయింగ్, పురుషుల హై జంప్ క్వాలిఫయింగ్, పురుషుల ట్రిపుల్ జంప్ క్వాలిఫయింగ్
బాక్సింగ్ - పురుషుల 63.5 కేజీలు, పురుషుల 80 కేజీల ఫైనల్స్
గోల్ఫ్ - మహిళల రౌండ్ 1
టేబుల్ టెన్నిస్ - పురుషుల & మహిళల జట్టు క్వార్టర్-ఫైనల్, పురుషుల జట్టు సెమీ-ఫైనల్
వెయిట్ లిఫ్టింగ్ - మహిళల 49 కిలోలు
రెజ్లింగ్ - మహిళల 50 కిలోల సెమీ-ఫైనల్ టు మెడల్ మ్యాచ్‌లు, మహిళల 53 కిలోల రౌండ్ ఆఫ్ 16 & క్వార్టర్-ఫైనల్
ఆగస్టు 8, గురువారం
అథ్లెటిక్స్ - పురుషుల జావెలిన్ త్రో ఫైనల్, మహిళల 100 మీటర్ల హర్డిల్స్ రిపీచేజ్, మహిళల షాట్ పుట్ క్వాలిఫయింగ్
బాక్సింగ్ - పురుషుల 51 కేజీలు, మహిళల 54 కేజీల ఫైనల్స్
హాకీ - పురుషుల మెడల్ మ్యాచ్ లు
గోల్ఫ్ – మహిళల రౌండ్ 2
టేబుల్ టెన్నిస్ – పురుషుల & మహిళల సెమీ-ఫైనల్ రెజ్లింగ్- మహిళల 57 కిలోల రౌండ్ ఆఫ్ 16 & క్వార్టర్-ఫైనల్, మహిళల 53 కిలోల సెమీ-ఫైనల్ టు మెడల్ మ్యాచ్‌లు, పురుషుల 57 కిలోల రౌండ్ ఆఫ్ 16 & క్వార్టర్-ఫైనల్
ఆగస్టు 9, శుక్రవారం
అథ్లెటిక్స్ – మహిళల 4x400m రిలే రౌండ్ 1, పురుషుల 4x400m రిలే రౌండ్ 1, మహిళల 100m హర్డిల్స్ సెమీ-ఫైనల్, మహిళల షాట్ పుట్ ఫైనల్, పురుషుల ట్రిపుల్ జంప్ ఫైనల్
బాక్సింగ్ - పురుషుల 71 కేజీలు, మహిళల 50 కేజీలు, పురుషుల 92 కేజీలు, మహిళల 66 కేజీల ఫైనల్స్
గోల్ఫ్ – మహిళల రౌండ్ 3
టేబుల్ టెన్నిస్ – పురుషుల & మహిళల టీమ్ మెడల్ మ్యాచ్‌లు
రెజ్లింగ్ – మహిళల 57 కిలోల సెమీ-ఫైనల్ టు మెడల్ మ్యాచ్‌లు, పురుషుల 57 కిలోల సెమీ-ఫైనల్ టు మెడల్ మ్యాచ్‌లు, మహిళల 62 కిలోల రౌండ్ ఆఫ్ 16 & క్వార్టర్-ఫైనల్
ఆగస్టు 10, శనివారం
అథ్లెటిక్స్ – మహిళల 4x400m రిలే ఫైనల్, పురుషుల 4x400m రిలే ఫైనల్, మహిళల 100m హర్డిల్స్ ఫైనల్, మహిళల జావెలిన్ త్రో ఫైనల్, పురుషుల హైజంప్ ఫైనల్
బాక్సింగ్ - మహిళల 57 కేజీలు, పురుషుల 57 కేజీలు, మహిళల 75 కేజీలు, పురుషుల +92 కేజీల ఫైనల్స్
గోల్ఫ్ – మహిళల రౌండ్ 4
టేబుల్ టెన్నిస్ – పురుషుల & మహిళల టీమ్ మెడల్ మ్యాచ్‌లు
రెజ్లింగ్ – మహిళల 76 కిలోల రౌండ్ ఆఫ్ 16 & క్వార్టర్-ఫైనల్, మహిళల 62 కిలోల సెమీ-ఫైనల్ మరియు మెడల్ మ్యాచ్‌లు
ఆగస్టు 11, ఆదివారం
రెజ్లింగ్ - మహిళల 76 కేజీల సెమీ-ఫైనల్ టు మెడల్ మ్యాచ్‌లు
ఆర్చరీ: మహిళల వ్యక్తిగత ర్యాంకింగ్ రౌండ్ (1 pm) మరియు పురుషుల వ్యక్తిగత ర్యాంకింగ్ రౌండ్
TEAM INDIA : టీమిండియా భవిష్యత్ ముగ్గురు మొనగాళ్లు.. !