అన్నింటిలోనూ ఛాంపియ‌న్.. కోహ్లీ కంటే రోహిత్ ను క్రికెట‌ర్లు ఎక్కువ‌ ఇష్ట‌ప‌డేది అందుకే.. !

By Mahesh Rajamoni  |  First Published Jul 17, 2024, 5:37 PM IST

Rohit Sharma : భారత క్రికెటర్ అమిత్ మిశ్రా ఛాంపియ‌న్ ప్లేయ‌ర్లు విరాట్ కోహ్లీ,  రోహిత్ శర్మల‌తో తన సంబంధాల గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. మిశ్రాలాగే యువ‌రాజ్ సింగ్ కూడా కామెంట్స్ చేశాడు. 
 


Rohit Sharma : ప్రపంచకప్ విజేత కెప్టెన్ రోహిత్ శర్మ  ప‌వ‌ర్, ఫేమ్ ఉన్న‌ప్ప‌టికీ ఎలాంటి మార్పు లేకుండా అంద‌రితో ఇప్ప‌టికీ ఒకేలా ఉన్నార‌ని టీమిండియా మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రా అన్నారు. అయితే, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ విష‌యంలో మారిపోయాడ‌ని మిశ్రా ఇటీవల ఒక‌ పోడ్‌కాస్ట్‌లో పేర్కొన్నాడు. యూట్యూబ్‌లో శుభంకర్ మిశ్రా హోస్ట్ చేసిన అన్‌ప్లగ్డ్ పాడ్‌కాస్ట్‌లో అత‌ను మాట్లాడుతూ.. షాకింగ్ విష‌యాలు వెల్ల‌డించాడు.

చాంపియ‌న్ ప్లేయ‌ర్ అయిన‌ప్పటికీ రోహిత్ ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేకుండా అంద‌రికీ అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్న తీరును గురించి మిశ్రా మాట్లాడుతూ.. "నేను అర్ధ దశాబ్దం పాటు భారత జట్టులో భాగం కాలేదు, కానీ ఇప్పటికీ రోహిత్ శర్మ.. నేను కలిసినప్పుడల్లా  చాలా ముచ్చ‌ట్లు పెడుతాం. ప‌రిహాసం ఆడుతాం.. అతను చాలా జోకులు వేస్తాడు. మేము ఒక‌రినొక‌రం మాట్లాడని సమయం ఉంది.. కానీ ఇప్ప‌టికీ మాకు గొప్ప బంధం ఉంది" అని తెలిపాడు. 

Latest Videos

అలాగే, తాను మొదటిసారి కలిసినప్పుడు రోహిత్ ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడ‌ని మిశ్రా అన్నాడు. ఎప్పుడైనా హిట్ మ్యాన్ అందరితో క‌లిసిపోతాడ‌నీ.. అందుకే అంద‌రికీ ఇష్ట‌మైన వ్య‌క్తిగా ఉన్నాడ‌ని తెలిపాడు. ఇక విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుతూ.. కోహ్లీతో ముందులా ఉన్న సంబంధాలు లేవ‌ని తెలిపాడు. తాము మాట్లాడుకోవడం కూడా దాదాపు లేద‌న్నాడు. ఇక్క‌డ ప‌వ‌ర్, ఫేమ్ గురించి మాట్లాడితే విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌కు మ‌ధ్య చాలా తేడా ఉంద‌న్నాడు. కోహ్లీ మార‌డం చూశాన‌నీ, ప‌వ‌ర్, ఫేమ్ పొందినప్పుడు ప్రతి ఒక్కరూ ఒక ఉద్దేశంతో వారిని చేరుకుంటారని అన్నాడు. అలాంటి వారిలో తాను లేన‌ని అమిత్ మిశ్రా చెప్పాడు. కాగా, అంత‌కుముందు, 2011 ప్రపంచకప్ చాంపియ‌న్ ప్లేయ‌ర్ యువరాజ్ సింగ్ కూడా పోడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ఇదే త‌ర‌హా అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

హార్దిక్ పాండ్యా కు గౌతమ్ గంభీర్ షాక్..

PARIS OLYMPICS 2024 లో పాల్గొంటున్న భార‌త క్రీడాకారులు వీరే

click me!