పారాలింపిక్స్ 2020: ఫైనల్‌లో పోరాడి ఓడిన భవీనా పటేల్... టీటీలో భారత్‌కి రజతం...

By Chinthakindhi Ramu  |  First Published Aug 29, 2021, 8:22 AM IST

వరల్డ్ నెం.1 పారా టీటీ ప్లేయర్ జియో యింగ్‌తో జరిగిన మ్యాచ్‌‌లో పోరాడి ఓడిన భవీనా పటేల్... పారాలింపిక్స్ చరిత్రలో ఇదే టేబుల్ టెన్నిస్‌లో భారత్‌కి తొలి పతకం..


పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్, టీటీ ప్లేయర్ భవీనా పటేల్ ఫైనల్‌లో పోరాడి ఓడి, రజతం గెలుచుకుంది. చైనాకి చెందిన వరల్డ్ నెం.1 పారా టీటీ ప్లేయర్ జియో యింగ్‌తో జరిగిన మ్యాచ్‌లో 0-3 తేడాతో వరుస సెట్లలో ఓడింది భవీనా. ఈ పారాలింపిక్స్‌లో భారత్‌కి ఇదే మొట్టమొదటి పతకం కాగా, టేబుల్ టెన్నిస్‌ చరిత్రలో టీమిండియాకి ఇదే తొలి పతకం....

Congratulations to for creating history by winning India's first silver medal in women's singles class 4 table tennis event at the ongoing .
A wonderful display of focus , hardwork and mental strength. pic.twitter.com/Ijh9LmfBTo

— Virender Sehwag (@virendersehwag)

పారాలింపిక్స్‌ ఫైనల్‌లో 11-7, 11-5, 11-6 తేడాతో ఓడినప్పటికీ టేబుల్ టెన్నిస్ పోటీల్లో ఫైనల్ చేరిన మొట్టమొదటి భారత పారా అథ్లెట్‌గానూ చరిత్ర సృష్టించింది భవీనా పటేల్. 

There you have it!!! 🥈✨🇮🇳 wins the first medal of for !!!🏓
On our 🎉 🥈 pic.twitter.com/5yk4knCstg

— Paralympic India 🇮🇳 #Cheer4India 🏅 #Praise4Para (@ParalympicIndia)

Latest Videos

undefined

పారాలింపిక్స్‌ 202లో భారత్‌కి మొట్టమొదటి పతకం అందించిన భవీనా పటేల్‌కి టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, పరుగుల రాణి పీటీ ఉషా అభినందనలు తెలిపారు. 

My best wishes to everyone on National Sports Day today! Heartiest congratulations to on winning the 🥈medal Paralympic Games. This is India's first ever Table Tennis medal either at Olympics or

— P.T. USHA (@PTUshaOfficial)

పారాలింపిక్స్‌లో దీపా మాలిక్ తర్వాత పతకం సాధించిన రెండో భారత మహిళా అథ్లెట్‌గా రికార్డు క్రియేట్ చేసింది భవీనా పటేల్. 2016 రియో పారాలింపిక్స్‌లో షార్ట్ పుట్‌లో దీపా మాలిక్ రజతం సాధించింది.

click me!