వన్డేల్లో టీమిండియా నెంబర్‌వన్‌..వెస్టిండీస్ గెలిస్తేనే..!!

By Siva KodatiFirst Published Feb 5, 2019, 7:59 AM IST
Highlights

ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్, వన్డే సిరీస్‌తో పాటు న్యూజిలాండ్‌పై వన్డే సిరీస్ నెగ్గిన భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే బలమైన జట్టుగా ఉంది. ఇప్పటికే ఎన్నో మైలురాళ్లను అధిగమించి చరిత్ర సృష్టించిన టీమిండియాను మరో ఘనత ఊరిస్తోంది. అదే ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం.

ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్, వన్డే సిరీస్‌తో పాటు న్యూజిలాండ్‌పై వన్డే సిరీస్ నెగ్గిన భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే బలమైన జట్టుగా ఉంది. ఇప్పటికే ఎన్నో మైలురాళ్లను అధిగమించి చరిత్ర సృష్టించిన టీమిండియాను మరో ఘనత ఊరిస్తోంది

. అదే ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం. టెస్టుల్లో గత రెండేళ్లుగా అగ్రస్థానంలో కొనసాగుతున్న భారత్... వన్డేల్లోనూ నెంబర్‌వన్‌గా నిలిచింది కానీ దానిని నిలబెట్టుకోలేకపోయింది. ప్రస్తుతం రెండో స్థానంలో కొనసాగుతోంది.

అగ్రస్థానంలో ఉన్న ఇంగ్లాండ్ ఖాతాలో 126 ర్యాంకింగ్ పాయింట్లు ఉండగా... భారత్‌కు కేవలం నాలుగు పాయింట్లు మాత్రమే తక్కువ. భారత్ కొద్దిరోజుల్లో ఆస్ట్రేలియాతో ఐదు వన్డేల సిరీస్‌ను ఆడనుంది. అయితే అంతకన్నా ముందే టీమిండియా నెంబర్‌వన్ అయ్యే అవకాశం ఉంది.

మూడు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్‌పై గెలిచిన వెస్టిండీస్... వన్డే సిరీస్‌లోనూ అదే తరహా ప్రదర్శన చేసి ఇంగ్లీష్ జట్టును ఓడిస్తే అప్పుడు ఇంగ్లాండ్ పాయింట్లు తగ్గుతాయి. భారత్ అగ్రస్థానానికి చేరుతుంది. కానీ ఒకవేళ ఇంగ్లాండ్.. విండీస్‌పై పైచేయి సాధిస్తే... ఆసీస్‌తో జరగబోయే సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేయాల్సి ఉంటుంది. 

ధోనీ కీపింగ్‌లో ఉంటే.. క్రీజు వదలి ఆడొద్దు: ఆటగాళ్లకు ఐసీసీ హెచ్చరిక

తొలుత బ్యాటింగ్: అసలు విషయం చెప్పిన రోహిత్ శర్మ

కోహ్లీ స్థానం తనకివ్వాలని కోరుతున్నచాహల్

టీంఇండియా నోట పాపులర్ సినిమా డైలాగ్.. బీసీసీఐ ట్వీట్

ఒంటరినై పోయాను: భార్యను ఉద్దేశిస్తూ రోహిత్ సంచలన వ్యాఖ్యలు

స్పిన్నర్ కేదార్ జాదవ్ కు షాకిచ్చిన ధోనీ

తప్పిదం: పరుగు కోల్పోయిన హార్దిక్ పాండ్యా

భారత బ్యాట్స్‌మెన్ ఎందుకు విఫలమవుతున్నారంటే..!!

స్వింగ్‌తో ఒకరు.. స్పిన్‌తో మరోకరు: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లిన బౌల్ట్, చాహల్

click me!