Konica Layak Suicide: కొద్దిరోజుల క్రితం బాలీవుడ్ సూపర్ స్టార్ సోనూ సూద్.. ఆమెకు రైఫిల్ గిఫ్ట్ ఇవ్వడంతో కొనికా వెలుగులోకి వచ్చింది. జాతీయ స్థాయి పోటీలకు సిద్ధపడుతున్న ఆమె సూసైడ్ పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జాతీయ షూటర్ కొనికా లాయక్ అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. కోల్కతాలోని ఓ హాస్టల్ లో ఉంటున్న ఆమె ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. జార్ఖండ్ లోని వెనుకబడిన ప్రాంతమైన ధనాబాద్ నుంచి వచ్చిన కొనికా మరణానికి కారణాలేమీ తెలియరాలేదు. కొద్దిరోజుల క్రితం బాలీవుడ్ సూపర్ స్టార్ సోనూ సూద్.. ఆమెకు రైఫిల్ గిఫ్ట్ ఇవ్వడంతో కొనికా వెలుగులోకి వచ్చింది. కొనికా మరణంపై సోనూ సూద్ విచారం వ్యక్తం చేశాడు. ఆమె మరణం తానొక్కడినే కాదని, దేశాన్ని మొత్తం శోకసంద్రంలో నింపిందని ఆవేదన వ్యక్తం చేశాడు.
ధనాబాద్ కు చెందిన కొనికా.. రాష్ట్రస్థాయి పోటీలలో నాలుగు సార్లు బంగారు పతకం సాధించింది. అయితే నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన కొనికా జాతీయ స్థాయిలో రాణించడానికి పేదరికం అడ్డొచ్చింది. ఈ కారణంగానే ఆమె జాతీయ పోటీలలో పాల్గొనలేకపోయింది. ఇదే విషయాన్ని ఈ ఏడాది మార్చిలో బాలీవుడ్ నటుడు సోనూ సూద్ కు ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఆయనను ట్యాగ్ చేస్తూ ఆమె చేసిన ట్వీట్ వైరలైంది.
undefined
🔥✔️Sonu sood gift a Rifle to jharkhand state Rifle shooting championship konica Layak
-- pic.twitter.com/RF9YxTzEVK
కొనికా ట్వీట్ కు స్పందించిన సోనూ సూద్ ఆ మట్టిలో మాణిక్యానికి అలాంటి పరిస్థితి రావడం చూసి చలించిపోయాడు. ఆమెకు రూ. 2.40 లక్షల విలువ చేసే రైఫిల్ ను బహుమతిగా పంపించాడు. జాతీయ పోటీలలో రాణించాలని ఆమెను శుభాకాంక్షలు తెలిపాడు.
आज सिर्फ मेरा नहीं,
सिर्फ धनबाद का नहीं,
पूरे देश का दिल टूटा है। 💔 https://t.co/gD3Qb7UAel
అంతా బాగానే సాగుతున్న తరుణంలో హఠాత్తుగా కొనికా ఆత్మహత్యకు పాల్పడటం పలు అనుమానాలకు తావిస్తున్నది. జాతీయ స్థాయి పోటీలకు గాను కోల్కతాలోని ఓ షూటింగ్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న ఆమె ఇటీవలే ఓ పెళ్లికి హాజరైంది. ఆ తర్వాత నుంచి కొనికా డల్ గా ఉంటుందని, ప్రాక్టీస్ లో కూడా చురుకుగా కనిపించలేదని అకాడమీకి సంబంధించిన వ్యక్తులు చెబుతున్నారు. అయితే సూసైడ్ లెటర్ లో కొనికా.. తాను కొంతకాలంగా రాణించలేకపోతుండటం వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నానని రాసినట్టు వార్తలు వస్తున్నాయి.
ఇదిలాఉండగా.. గడిచిన నాలుగు నెలల్లో నలుగురు షూటర్లు ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం. నవంబర్ నెలలో పదిహేడేండ్ల షూటర్ కౌష్ సీరత్ (పంజాబ్) కూడా సూసైడ్ చేసుకుంది. ఈ ఏడాది అక్టోబర్ లో జరిగిన వరల్డ్ ఛాంపియన్స్ లో ఆమె పాల్గొనడం విశేషం. సీరత్ కంటే ముందు.. హనర్దీప్ సింగ్ సోహల్, నమన్వీర్ సింగ్ లు కూడా ఆత్మహత్యకు పాల్పడటం గమనార్హం.