ట్రాక్టర్ ఎక్కిన ధోనీ.. ఆశ్చర్యపోయిన అభిమానులు

Published : Aug 05, 2018, 11:27 AM IST
ట్రాక్టర్ ఎక్కిన ధోనీ.. ఆశ్చర్యపోయిన అభిమానులు

సారాంశం

టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీకి ఆటోమొబైల్స్ అంటే వల్లమాలిన ప్రేమ. మార్కెట్లోకి కొత్తగా ఏ బైక్, కార్ వచ్చినా అది నడపాల్సిందే. అలాంటి మిస్టర్ కూల్ ట్రాక్టర్ ఎక్కి గ్రౌండ్‌కి వచ్చాడు.

టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీకి ఆటోమొబైల్స్ అంటే వల్లమాలిన ప్రేమ. మార్కెట్లోకి కొత్తగా ఏ బైక్, కార్ వచ్చినా అది నడపాల్సిందే. అలాంటి మిస్టర్ కూల్ ట్రాక్టర్ ఎక్కి గ్రౌండ్‌కి వచ్చాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌(టీఎన్‌పీఎల్)‌లో భాగంగా తిరునల్వేలిలో మధురై పాంథర్స్, కోవై కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌కు ధోనీ హాజరయ్యాడు.

ఈ సందర్భంగా ట్రాక్టర్ నడిపి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తిన మిస్టర్ కూల్... వచ్చే ఐపీఎల్ సీజన్ నాటికి తమిళం బాగా నేర్చుకుంటానని.. ప్రతి ఏడాది టీఎన్‌పీఎల్‌లో జరిగే కొన్ని మ్యాచ్‌లకు తప్పకుండా హాజరవుతానని తెలిపాడు. మరోవైపు తమ అభిమాన క్రికెటర్ స్టేడియంలో ప్రత్యక్షం కావడంతో అభిమానులు సంబరపడిపోయారు. 

PREV
click me!

Recommended Stories

గంభీర్ రాకతో టీమిండియా రాంరాం.! మరో డబ్ల్యూటీసీ ఫైనల్ హుష్‌కాకి..
IND vs SA: 3 సెంచరీలు, 3 ఫిఫ్టీలతో 995 రన్స్.. గిల్ ప్లేస్‌లో ఖతర్నాక్ ప్లేయర్ తిరిగొస్తున్నాడు !