కోచ్ పై మనికా బాత్రా సంచలన ఆరోపణలు..!

By telugu news teamFirst Published Sep 4, 2021, 11:10 AM IST
Highlights

సౌమ్యదీప్ రాయ్ ని తనని ఫిక్సింగ్ చేయమన్నాడంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయ్. 

టీమిండియా టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మానికా బత్రా.. టోక్యో ఒలంపిక్స్ లో పాల్గొని.. మూడో రౌండ్ లో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ పోటీల్లో పాల్గొనే సమయంలో.. ఆమె కనీసం తన కోచ్ లేకుండా పోటీకి దిగడం గమనార్హం.

ఇండియన్ ఒలింపిక్ కమిటీ నియమించిన నేషనల్ కోచ్ సౌమ్యదీప్‌ రాయ్‌ ను కాదని.. టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొంది. దీనిపై ఐవోసి మనికా బాత్రాపై సీరియస్ అయిన సంగతి తెలిసిందే. అయితే, లేటెస్ట్ గా మనికా బాత్రా సౌమ్యదీప్ రాయ్ పై సంచలన ఆరోపణలు చేసింది. సౌమ్యదీప్ రాయ్ ని తనని ఫిక్సింగ్ చేయమన్నాడంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర సంచలనం రేపుతున్నాయి.

సుతీర్ధ, మనికాలు సౌమ్యదీప్ రాయ్ పర్యవేక్షణలోనే జాతీయ టీటీ టీమ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒలింపిక్ క్వాలిఫయర్స్ అప్పుడూ తనను ఓ మ్యాచ్ ఓడిపోమ్మానడంటూ మనికా బాత్రా సౌమ్యదీప్ రాయ్ పై విమర్శలు గుప్పించింది. అందుకే ఒలింపిక్స్ లో సౌమ్యదీప్ రాయ్ ని కోచ్ గా వద్దన్నంటూ ఆమె తెలిపింది.

తనకు వ్యక్తిగత కోచ్  ను పెట్టుకునే అవకాశం ఇవ్వలేదని.. వ్యక్తిగత కోచ్‌లు ఉంటే ఇగో కాదని, అది కనీస అవసరమని వ్యాఖ్యానించింది.

మనికా మాట్లాడుతూ.. ‘టీమ్‌ ఈవెంట్లు ఉన్నప్పుడు చీఫ్‌ కోచ్‌ ఉండటం సబబే. కానీ టెన్నిస్‌, బ్యాడ్మింటన్‌, టీటీ లలో సింగిల్స్‌ మ్యాచ్‌లు ఆడుతున్నప్పుడు వ్యక్తిగత కోచ్‌ల అవసరం తప్పనిసరిగా ఉంటుంది. వ్యక్తిగత కోచ్‌ అయితే తాను శిక్షణనిచ్చే ప్లేయర్‌ ఆటతీరుతో పాటు అతడు/ఆమె గురించిన పూర్తి అవగాహన ఉంటుంది. కానీ చీఫ్‌ కోచ్‌ మొత్తం టీమ్‌ సభ్యుల పోటీల గురించి మాత్రమే ఆలోచిస్తాడు. కోచ్‌లను పెట్టుకోవడం ఇగో కాదు. అది కనీస అవసరం’ అని తెలిపింది.

click me!