వ్యక్తిగత రికార్డులు కాదు...జట్టు గెలుపే ముఖ్యమని నిరూపించిన ధోని

By Arun Kumar PFirst Published Jan 18, 2019, 4:46 PM IST
Highlights

మెల్ బోర్న్ వన్డేలో భారత జట్టును విజయతీరాలకు చేర్చడంతో టీంఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ముఖ్య పాత్ర పోషించారు. ఇలా ఆసాంతం వన్డే సీరిస్‌లో రాణించి టీంఇండియా గెలుపులో కీలకంగా వ్యవహరించాడు. అయితే ఈ మ్యాచ్ ద్వారా ధోని మరోసారి తనకు వ్యక్తిగత రికార్డులు ముఖ్యం కాదని...జట్టు విజయమే ముఖ్యమని నిరూపించాడు.  

మెల్ బోర్న్ వన్డేలో భారత జట్టును విజయతీరాలకు చేర్చడంతో టీంఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ముఖ్య పాత్ర పోషించారు. ఇలా ఆసాంతం వన్డే సీరిస్‌లో రాణించి టీంఇండియా గెలుపులో కీలకంగా వ్యవహరించాడు. అయితే ఈ మ్యాచ్ ద్వారా ధోని మరోసారి తనకు వ్యక్తిగత రికార్డులు ముఖ్యం కాదని...జట్టు విజయమే ముఖ్యమని నిరూపించాడు. 

నిర్ణయాత్మక మూడో టెస్టులో కీలమైన మూడు వికెట్లు పడిపోయి జట్టు కష్టాల్లో వున్న సమయంలో అనూహ్యంగా ధోని బ్యాటింగ్‌కు వచ్చాడు. యువ ఆటగాడు కేదార్ జాదవ్ తో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడుతూ స్కోరు బోర్డును మెల్లిగా ముందుకు కదిలించాడు. ఇలా క్రీజులో కాస్త కుదురుకున్నాక తనదైన ఆటతీరుతో చెలరేగాడు. ఇలా 74 బంతుల్లో ధోని హాప్ సెంచరీ సాధించాడు. 

అయితే అప్పటికీ ఇంకా భారత విజయానికి చాలా పరుగులు అవసరముంది. దీంతో తన హాప్ సెంచరీ  సందర్భంగా  ఎలాంటి  సంబరాలు చేసుకోకుండానే ధోని బ్యాటింగ్ కొనసాగించాడు. ఇలా మ్యాచ్ చివరి వరకు నాటౌట్ గా నిలిచి జట్టు విజయం సాధించిన తర్వాతే ధోని సంబరాలు చేసుకున్నాడు. ఇలా తనప వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు విజయానికే ధోని ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మరోసారి అభిమానులను ఆకట్టుుకున్నాడు. 

మొత్తంగా మూడు వన్డే సీరిస్ ను భారత్ 2-1 తేడాతో సొంతం చేసుకోవడంలో ధోని కీలక పాత్ర వహించాడు.చివరి వన్డేలో ధోనీ మరోసారి తన సత్తా చాటి భారత్ కు విజయాన్ని అందించాడు. అతను 114 బంతుల్లో 87 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కేదార్ జాదవ్ 57 బంతుల్లో 61 పరుగులు చేశాడు. వీరిద్దరు కలిసి విలువైన భాగస్వామ్యం నెలకొల్పి ఆస్ట్రేలియా నిర్దేశించిన  231 పరుగుల లక్ష్యాన్ని నాలుగు బంతులు మిగిలి ఉండగానే చేదించారు.   

సంబంధిత వార్తలు

ఆస్ట్రేలియాకు షాక్: వన్డే సిరీస్ కూడా భారత్ ఖాతాలోనే..

ధోనీ స్లాట్: కోహ్లీని కాదన్న రోహిత్ శర్మ

ధోనీ స్లాట్: రోహిత్ శర్మనే కరెక్ట్, రాయుడికి ఎసరు

 భువనేశ్వర్ కుమార్ కళ్లు చెదిరే డైవింగ్ క్యాచ్...(వీడియో)

మెల్ బోర్న్ వన్డే..భారత స్పిన్నర్ చాహల్ రికార్డ్

click me!