
టీంఇండియా బౌలర్ కుల్దీప్ యాదవ్ రాజ్ కోట్ టెస్టులో తన బౌలింగ్ ప్రదర్శనతో అదరగొట్టిన విషయం తెలిసిందే. తన చైనా మన్ బౌలింగ్ తో విండీస్ బ్యాట్ మెన్స్ పై కుల్దీప్ విరుచుకుపడటంతో భారత జట్టు మొదటి టెస్టులో ఇన్నింగ్స్ 272 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్ లో కుల్దీప్ స్పిన్ మాయాజాలంతో 5 వికెట్లు తీసి విండిస్ పతనాన్ని శాసించాడు. ఇలా ఈ టెస్ట్ మ్యాచ్ ద్వారా కుల్దీప్ తన కెరీర్ లోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసుకున్నాడు.
ఇలా కుల్దీప్ మూడు ఫార్మాట్లలో ఐదు వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఫేస్ బౌలర్ భువనేశ్వర్ తర్వాత ఈ ఘనత సాధించింది కుల్దీప్ ఒక్కడే. స్పిన్నర్లలో విషయానికి వస్తే ఇలా మూడు ఫార్మాట్లలో ఈ ఘనత సాధించింది భారత స్పిన్నర్ కుల్దీప్ ఒక్కడే.
ప్రత్యేకమైన ఈ రికార్డుకు మరింత ప్రత్యేకత కల్పించాలని బిసిసిఐ భావించింది. దీంతో విండీస్ తో మూడో రోజు మ్యాచ్ ముగిసిన తర్వాత తన బౌలింగ్ ప్రదర్శనపై తానే కాంమెటరీ చెప్పాలని బిసిసిఐ కుల్దీప్ ను సూచించింది.
దీన్ని కుల్దీప్ కూడా సీరియస్ గా తీసుకున్నాడు. తాను బస చేసే హోటల్ కు చేరుకున్న కుల్దీప్ లాప్ టాప్ లో మ్యాచ్ చూస్తూ తనదైన స్టైల్లో కామెంటరీ చెప్పాడు. ప్రొపెషనల్ కామెంటేటర్ మాదిరిగా తన బౌలింగ్ పై తానే కామెంటరీ చెప్పుకున్నాడు. ఈ వీడియోను బిసిసిఐ అధికారిక ట్విట్టర్ పేజిలో పోస్ట్ చేసింది. దీంతో ఆ వీడియో ఇపుడు వైరల్ మారింది.
వీడియో
సంబంధిత వార్తలు
భారత్ తిరుగులేని ఆధిపత్యం: వెస్టిండీస్ స్కోరు 94/6
59 ఏళ్ల రికార్డు బద్ధలు.. అరంగేట్రంలోనే పృథ్వీషా ఘనత
ఆసియా కప్ విశ్రాంతిపై క్లారిటీ ఇచ్చిన విరాట్ కోహ్లీ
సచిన్ కి దక్కని రికార్డ్ ని సొంతం చేసుకున్న పృథ్వీ షా
కనీసం నాకు చెప్పలేదు.. మురళీ విజయ్ ఆవేదన
నా సెంచరీ ఆయనకే అంకితం :పృథ్విష