రూ.700 కోట్ల స్కాంలో చిక్కుకున్న యువరాజ్ తల్లి.. రంగంలోకి ఈడీ

By sivanagaprasad kodatiFirst Published Oct 7, 2018, 4:26 PM IST
Highlights

తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు చెల్లిస్తామంటూ ప్రజలను మోసం చేసే పొంజీ స్కీమ్ మోసంలో ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్ తల్లి షబ్నమ్ సింగ్ కూడా చిక్కుకున్నారు

తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు చెల్లిస్తామంటూ ప్రజలను మోసం చేసే పొంజీ స్కీమ్ మోసంలో ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్ తల్లి షబ్నమ్ సింగ్ కూడా చిక్కుకున్నారు. సాధన ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన పోంజి స్కీమ్ మేనేజర్లు షబ్నమ్ సింగ్‌తో పాటు మరికొంతమందికి పెట్టుబడి పెడితే.. 84 శాతం రిటర్నులు ఇస్తామని నమ్మబలికారు. వారి మాటను నమ్మిన వీరంతా సాధన ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన పోంజి స్కీముల్లో పెట్టుబడి పెట్టారు.

షబ్నమ్ సుమారు కోటీ రూపాయలు జమ చేశారు. అయితే కొద్దిరోజులు బాగానే ఉన్నప్పటికీ తరువాత పరిస్థితిలో మార్పు వచ్చింది. ఎవరికీ కూడా ఒప్పందంలో చెప్పినట్లుగా రిటర్నులు ఇవ్వకుండా షెల్ కంపెనీలకు తరలించారు. ఈ మోసం వెలుగులోకి రావడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. ఇన్వెస్టర్లతో పాటు సాధనా ఎంటర్‌ప్రైజెస్ పోంజీ స్కీమ్ మేనేజర్ల నగదు లావాదేవీలను జల్లెడ పడుతోంది.

మరోవైపు యువరాజ్ తల్లలి షబ్నమ్ పెట్టిన కోటి రూపాయల పెట్టుబడిపైనా ఈడీ ఆరా తీస్తోంది. మేనేజర్లు ఒప్పందంలో చెప్పినట్లుగా నెలకు రూ.7 లక్షలు చెల్లించారని.. సగం డబ్బు తిరిగొచ్చేసిందని ఈడీ తెలిపింది. అయితే మిగతా రూ.50 లక్షలు మాత్రం చెల్లించలేదని పేర్కొంది.

ఈ కేసులో షబ్నమ్ జరిపిన లావాదేవీలన్నింటిని వారం రోజుల్లో తమకు తెలపాల్సిందిగా.. ఎన్‌ఫోర్స్‌మెంట్.. షబ్నమ్‌కు నోటీసులు జారీ చేసింది. అయితే తనకు ఎలాంటి నోటీసులు రాలేదని షబ్నమ్ తెలిపారు..మరోవైపు ఈ వ్యవహారంలో యువరాజ్‌కు ఎలాంటి ప్రమేయం లేదని తెలిసింది. 

click me!