సస్పెన్షన్ ఎత్తివేత: న్యూజిలాండ్‌కు పాండ్యా, ఇంగ్లాండ్‌కు కేఎల్ రాహుల్

By sivanagaprasad kodatiFirst Published Jan 25, 2019, 10:39 AM IST
Highlights

టీమిండియా ఆటగాళ్లు హార్డిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌పై విధించిన సస్పెన్షన్‌ను బీసీసీఐ పాలక మండలి ఎత్తివేయడంతో వారు తిరిగి భారత జట్టును చేరనున్నారు. పాండ్యా న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్నభారత జట్టును కలవనుండగా, కేఎల్ రాహుల్‌ ఇంగ్లాండ్‌లో ఉన్న భారత్-ఎ జట్టుతో చేరనున్నాడు.

టీమిండియా ఆటగాళ్లు హార్డిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌పై విధించిన సస్పెన్షన్‌ను బీసీసీఐ పాలక మండలి ఎత్తివేయడంతో వారు తిరిగి భారత జట్టును చేరనున్నారు. పాండ్యా న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్నభారత జట్టును కలవనుండగా, కేఎల్ రాహుల్‌ ఇంగ్లాండ్‌లో ఉన్న భారత్-ఎ జట్టుతో చేరనున్నాడు.

బాలీవుడ్ దర్శక, నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యతగా ఉన్న ‘‘కాఫీ విత్ కరణ్’’ షో లో పాల్గొన్న పాండ్యా, రాహుల్‌‌లు మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. దీంతో దేశవ్యాప్తంగా మహిళా సంఘాలు వీరిపై భగ్గుమన్నాయి. సోషల్ మీడియాలో సైతం వీరిద్దరిని ట్రోల్ చేశారు.

ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్న బీసీసీఐ పాలకుల మండలి ఇద్దరిపైనా నిషేధం విధించింది. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఇద్దరిని వెనక్కి పిలిపించింది. ఆసీస్ పర్యటన తర్వాత న్యూజిలాండ్ పర్యటనకు సైతం ఇద్దరిని ఎంపిక చేయలేదు.

అయితే పాండ్యా, రాహుల్‌ భవిష్యత్తు దృష్ట్యా ఇద్దరిపై నిషేధం ఎత్తివేయాలంటూ పలువురు మాజీలు బీసీసీఐని కోరారు. దీంతో మనసు మార్చుకున్న పాలకుల కమటీ ఇద్దరిపై నిషేధాన్ని ఎత్తివేసినట్లు తెలిపింది. అయితే విచారణను మాత్రం పెండింగ్‌లో పెట్టింది. అడ్డంకులు తొలగిపోవడంతో ఇద్దరు భారత జట్టును చేరడానికి మార్గం సుగమమైంది. 

బిగ్ రిలీఫ్: రాహుల్, పాండ్యాలపై సస్పెన్షన్ ఎత్తివేత

పాండ్యా వివాదంపై మొదటిసారి స్పందించిన కరణ్ జోహర్...

హర్దిక్ పాండ్యాకు మరో షాక్

హార్ధిక్ పాండ్యా, రాహుల్‌లకు షోకాజ్ నోటీసులు జారీచేసిన బిసిసిఐ

సెక్సిస్ట్ కామెంట్లపై వివాదం.. పాండ్యా క్షమాపణలు

పాండ్యా, రాహుల్‌లపై రెండు వన్డేల నిషేదం...సీఓఏ ఛైర్మన్ వినోద్ రాయ్

 

click me!