
రాజ్‌కోట్: రాజ్ కోట్ తొలి టెస్టు మ్యాచులో వెస్టిండీస్ బ్యాటింగ్ పై హర్భజన్ సింగ్ చేసిన ట్వీట్ పై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా రాజ్‌కోట్‌లో జరుగుతున్న తొలి టెస్టులో విండీస్ జట్టు ఘోరమైన ప్రదర్శన కనబరుస్తోంది. భారత్ తన తొలి ఇన్నింగ్స్‌ను 649/9 వద్ద డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్ రెండో రోజు ఆటముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 94 పరుగులు మాత్రమే చేసింది. బ్యాటింగ్ ప్రదర్శనపై హర్బజన్ సింగ్ ఓ ట్వీట్ చేశాడు. విండీస్ జట్టు ఆట తీరు చూస్తుంటే వారు కనీసం రంజీ ట్రోఫీ క్వార్టర్స్‌కు కూడా చేరేటట్టు కనిపించడం లేదని, అందరినీ ఇప్పుడిదే ప్రశ్న వేధిస్తోందని వ్యంగ్యాస్త్రం విసిరాడు.
హర్భజన్ ట్వీట్‌పై అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు. 2011, 2014లో ఇంగ్లండ్‌లో భారత జట్టు ప్రదర్శన కూడా ఇదే రకంగా ఉందని, ఇంగ్లిష్ మాజీ క్రికెటర్లు కూడా అప్పుడు ఇటువంటి వ్యాఖ్యలే చేసి ఉంటే నువ్వెలా స్పందించి ఉండేవాడివని బజ్జీని ప్రశ్నించారు. ఓ ఆటగాడిగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని అన్నారు.
విండీస్‌కు ఘనమైన చరిత్ర ఉందని, భారత్‌కు వచ్చేముందు ఇంగ్లండ్, యూఏఈలపై టెస్టులు గెలిచిన విషయం మర్చిపోవద్దని అన్నారు.
సంబంధిత వార్తలు
ఓవర్ యాక్షన్ తో టెన్షన్ లో పెట్టిన జడేజా: కోహ్లీ మందలింపు
భారత్ తిరుగులేని ఆధిపత్యం: వెస్టిండీస్ స్కోరు 94/6
59 ఏళ్ల రికార్డు బద్ధలు.. అరంగేట్రంలోనే పృథ్వీషా ఘనత
ఆసియా కప్ విశ్రాంతిపై క్లారిటీ ఇచ్చిన విరాట్ కోహ్లీ
సచిన్ కి దక్కని రికార్డ్ ని సొంతం చేసుకున్న పృథ్వీ షా
కనీసం నాకు చెప్పలేదు.. మురళీ విజయ్ ఆవేదన
నా సెంచరీ ఆయనకే అంకితం :పృథ్విష