సెంచరీతో కెరీర్‌కు వీడ్కోలు.. పొలిటిక్స్‌‌లోకి రానన్న గంభీర్

By sivanagaprasad kodatiFirst Published Dec 10, 2018, 10:14 AM IST
Highlights

టీమిండియా ఒకప్పటి స్టార్ బ్యాట్స్‌మెన్ గౌతమ్ గంభీర్ అంతర్జాతీయ క్రికెట్‌‌కు సెంచరీతో వీడ్కోలు పలికాడు. ఇటీవలే అంతర్జాతీయ క్రికట్‌లోని అన్ని ఫార్మాట్‌ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన గంభీర్.. ఆంధ్రాతో జరిగిన రంజీ మ్యాచ్‌లో చివరిసారిగా బరిలోకి దిగాడు.

మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గత కొంతకాలంగా తాను రాజకీయాల్లోకి రాబోతున్నట్లుగా వస్తున్న వార్తల్ని గంభీర్ కొట్టిపారేశాడు. తాను ట్వీట్టర్, ఫేస్‌బుక్ వంటి వేదికలపై సామాజిక, వర్తమాన వ్యవహారాలపై చురుగ్గా ఉండటం వల్లే బహుశా కొందరు రాజకీయాల్లోకి వస్తున్నాడేమో అనుకుంటున్నారు.

కానీ తనకు అటువంటి ఆలోచన లేదని.. తాను ఏ పార్టీలో చేరనని.. ఎన్నికల్లో పోటీ చేయనని తేల్చి చెప్పాడు. తనకు క్రికెట్‌లోనే అనుభవం ఉందని.. రాజకీయాలనేవి పూర్తిగా విభిన్నమైనవని.. క్రికెట్‌తో తన అనుబంధం కొనసాగించాలంటే ఏసీ గదుల్లో కూర్చొని కామెంట్రీ చేయడం కాదని అభిప్రాయపడ్డాడు.. కోచింగ్‌పై మాత్రం ఆసక్తి ఉందని.. కొన్నాళ్లు విశ్రాంతి తీసుకుని అనంతరం యువకులకు శిక్షణ ఇస్తానని గంభీర్ తెలిపాడు.

ఇష్టమైన కెప్టెన్ ధోనీనా, దాదానా: ఇద్దరు కాదంటున్న గంభీర్

అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన గంభీర్...

గంభీర్ ని పక్కనపెట్టిన ఫ్రాంఛైజీలు.. ఫ్యాన్స్ ఫైర్

అజారుద్దీన్ పై గంభీర్ కామెంట్స్.. మండిపడుతున్న నెటిజన్లు

రాజకీయాల్లోకి ధోనీ, గంభీర్..?

భార్యలను తీసుకువెళ్లడం వారి వ్యక్తిగతం.. గంభీర్

నా భార్య చంపేస్తుందంటున్న గంభీర్

click me!