అశ్విన్ అహంకారం: రోహిత్ శర్మకు అవమానం (చూడండి)

By pratap reddyFirst Published Dec 10, 2018, 7:37 AM IST
Highlights

టీ విరామ సమయానికి ముందు ఆసీస్ ఓపెనర్ అరోన్ ఫించ్ ను అవుట్ చేసి రవిచంద్రన్ అశ్విన్ తొలి దెబ్బ కొట్టాడు. దీంతో జట్టు సభ్యులందరూ అశ్విన్‌ను అభినందించారు. రోహిత్ శర్మ కూడా అశ్విన్ ను కరచాలనం చేసి అభినందించాలని ప్రయత్నించాడు.

అడిలైడ్: టీమిండియా బ్యాట్స్ మన్ రోహిత్ శర్మను స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అవమానించాడంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోను పోస్టు చేసి దుమ్మెత్తి పోస్తున్నారు.  భారత్ నిర్దేశించిన 323 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. 

టీ విరామ సమయానికి ముందు ఆసీస్ ఓపెనర్ అరోన్ ఫించ్ ను అవుట్ చేసి రవిచంద్రన్ అశ్విన్ తొలి దెబ్బ కొట్టాడు. దీంతో జట్టు సభ్యులందరూ అశ్విన్‌ను అభినందించారు. రోహిత్ శర్మ కూడా అశ్విన్ ను కరచాలనం చేసి అభినందించాలని ప్రయత్నించాడు.

రోహిత్‌ను పట్టించుకోనట్టు అశ్విన్ ప్రవర్తించాడు. ఏదో మాట్లాడుతూ రోహిత్ శర్మను అతను పట్టించుకోకుండా ముందుకు నడిచాడు. దీంతో చేతిని కాసేపు అలాగే ఉంచిన రోహిత్ చివరికి అశ్విన్ భుజం తట్టి వెనుదిరిగాడు.
 
వీడియోను చూసి క్రికెట్ అభిమానులు అశ్విన్ పై మండిపడుతున్నారు. అది రోహిత్‌ను అవమానించడమేనని అంటున్నారు. తనను పట్టించుకోనట్టు ప్రవర్తించినా రోహిత్ మాత్రం అతడిని భుజం తట్టి హుందాగా ప్రవర్తించాడని వ్యాఖ్యానిస్తున్నారు. 


అయితే, అశ్విన్ ను సమర్థించేందుకు కొందరు ప్రయత్నించారు. వేరే విషయం గురించి ఆలోచిస్తూ అశ్విన్ రోహిత్‌ కరచాలనం చేయడానికి వచ్చి విషయాన్ని చూడలేదని అంటున్నారు..

 

Kejriwal to those who don't donate! pic.twitter.com/AnzD9CtGHn

— bhaavna arora (@BhaavnaArora)
click me!