పాండ్యా వివాదంపై మొదటిసారి స్పందించిన కరణ్ జోహర్...

By Arun Kumar PFirst Published Jan 23, 2019, 1:07 PM IST
Highlights

కాఫీ విత్ కరణ్ షో లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి హార్దిక్ పాండ్యా చిక్కుల్లోపడిన విషయం తెలిసిందే. అతడితో పాటు యువ క్రికెటర్ కెఎల్.రాహుల్ కూడా అభిమానులు, మహిళల ఆగ్రహానికే కాదు...బిసిసిఐ క్రమశిక్షణ చర్యలకు గురయ్యారు. ఈ వివాదంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నా ఇప్పటివరకు ఈ కార్యక్రమ వ్యాఖ్యాత, బాలివడ్ డైరెక్టర్ కరణ్ జోహర్ స్పందించలేదు. తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరణ్ జోహార్ ఈ వివాదంపై స్పందించారు. 

ఇద్దరు యువ క్రికెటర్ల కేరీర్ పై ప్రభావం చూపిన ఈ వివాదానికి తానే బాధ్యత వహిస్తున్నట్లు కరణ్ పేర్కొన్నారు. ఎందుకంటే ఈ కార్యక్రమానికి అన్నీ తానై వ్యవహరిస్తాను కాబట్టి అందులో జరిగే ప్రతి విషయానికి తానే భాద్యున్నని తెలిపారు. అందులో పాల్గొనేవారు కేవలం అతిథులు మాత్రమే. ఇలాగే పాండ్యా, రాహుల్ లను సరదాగా ఇంటర్ల్యూకి  పిలిచానని...కానీ అది ఇలా వివాదంగా మారి వారి కెరీర్లపై ప్రభావం చూపుతుందని ఊహించలేదన్నారు. 

పాండ్యా వివాదాన్ని మొదట్లోనే అదుపులోకి తేవాలని చూశానని...కానీ అది ఆగకుండా తన చేయిదాటిపోయిందన్నారు. దీనివల్ల పశ్చాత్తాపంతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని... అందువల్లే బయటకు వచ్చి దీనిపై మాట్లాడలేక పోయానని ఆయన వివరణ ఇచ్చారు. వారు బహిరంగ క్షమాపణ చెప్పి పశ్చాత్తాపం వ్యక్తం చేశారు కాబట్టి ఇకనైనా వారిని వదిలిపెట్టాలని కరణ్ జోహర్ కోరారు. 

ఓ జాతీయ టివి ఛానల్లో ప్రసారమయ్యే కాఫీ విత్ కరణ్ షో కార్యక్రమంలో టీంఇండియా యువ ఆటగాళ్ళు హార్ధిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ లు కొన్నిరోజుల క్రితం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యాఖ్యాత కరణ్ జోహర్ అడిగిన పలు ప్రశ్నలకు హార్థిక్ పాండ్యా మహిళలను కించపర్చేలా జవాబులిచ్చాడు. తన వ్యక్తిగత లైంగిక వ్యవహారాల గురించి తల్లిదండ్రులతో చర్చించినట్లు కూడా పాండ్యా తెలిపాడు. ఈ వ్యాఖ్యలపై క్రికెట్ అభిమానులు, ప్రజలు,మహిళలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో వివాదాస్పదమయ్యాయి. దీంతో హార్దిక్ తో పాటు రాహుల్ పై కూడా బిసిసిఐ రెండు వన్డేల నిషేదాన్ని విధించింది. పాండ్యా, రాహుల్‌ బేషరతుగా క్షమాపణ చెప్పినా ఈ వివాదం సద్దుమణగడం లేదు. 

సంబంధిత వార్తలు

హర్దిక్ పాండ్యాకు మరో షాక్

హార్ధిక్ పాండ్యా, రాహుల్‌లకు షోకాజ్ నోటీసులు జారీచేసిన బిసిసిఐ

సెక్సిస్ట్ కామెంట్లపై వివాదం.. పాండ్యా క్షమాపణలు

పాండ్యా, రాహుల్‌లపై రెండు వన్డేల నిషేదం...సీఓఏ ఛైర్మన్ వినోద్ రాయ్

click me!