కేన్సర్ ట్రీట్మెంట్ కి వెళ్తే.. కరోనా పాజిటివ్

By telugu news teamFirst Published Jun 1, 2020, 12:45 PM IST
Highlights

ఆసియా క్రీడల్లో పసిడి పతకం గెలిచిన 41 ఏళ్ల డింకో సింగ్‌ ప్రస్తుతం కాలేయ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. చికిత్స కోసం ఇటీవల మణిపూర్‌ నుంచి ఢిల్లీకి వచ్చిన డింకో సింగ్‌కు పచ్చ కామెర్లు రావడంతో రేడియేషన్‌ థెరపీని మధ్యలోనే ఆపేశారు. 
 

గత కొంతకాలంగా కేన్సర్ తో పోరాడుతున్న మాజీ బాక్సర్ డింకో సింగ్ ఆరోగ్యం మరింత క్షీణించినట్లు తెలుస్తోంది. కేన్సర్ ట్రీట్మెంట్ కి వెళ్లిన ఆయనకు కరోనా సోకినట్లు గుర్తించారు. డింకోకు కరోనా సోకినట్టు అతడి సంబంధీకులు ఆదివారం తెలిపారు. 

1998 బ్యాంకాక్‌ ఆసియా క్రీడల్లో పసిడి పతకం గెలిచిన 41 ఏళ్ల డింకో సింగ్‌ ప్రస్తుతం కాలేయ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. చికిత్స కోసం ఇటీవల మణిపూర్‌ నుంచి ఢిల్లీకి వచ్చిన డింకో సింగ్‌కు పచ్చ కామెర్లు రావడంతో రేడియేషన్‌ థెరపీని మధ్యలోనే ఆపేశారు. 

దాంతో డింకో సింగ్‌ రోడ్డు మార్గం గుండా 2400 కిలోమీటర్లు అంబులెన్స్‌లో ప్రయాణించి మళ్లీ మణిపూర్‌కు చేరుకున్నాడు. అక్కడ అతనికి వైద్య పరీక్షలు నిర్వహించగా కోవిడ్‌-19 పాజిటివ్‌ వచ్చినట్లు తేలింది. ప్రస్తుత్తం ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.

క్యాన్సర్‌తో పోరాడుతున్న డింకోకి భారత బాక్సర్లు అండగా నిలిచిన విషయం తెలిసిందే. స్టార్ బాక్సర్లు విజేందర్ సింగ్, మనోజ్ కుమార్ చొరవ తీసుకొని మరి సాయం చేశారు. 'హమ్ మే హై దమ్' పేరుతో పలువురు బాక్సర్లు, కోచ్‌లు ఉన్న వాట్సాప్ గ్రూప్‌లో మనోజ్ కుమార్ డింకో ధీన స్థితిని తెలియజేసి మరి సాయం చేశాడు. 

విజేందర్ తన వంతుగా రూ.25 వేలు ఇవ్వగా.. ఆ తర్వాత మిగిలిన వారు తమ స్థాయి మేరకు డబ్బు పంపారు. ఇక డింకో బాధలను తెలుసుకుకన్న బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఎఫ్ఐ) మెరుగైన చికిత్స కోసం ఎయిర్ అంబులెన్స్‌లో ఢిల్లీకి పంపించింది.

click me!