నారా వారి ఆస్తులను నమ్మాలి అంతే...

First Published Oct 20, 2016, 3:38 AM IST
Highlights
  • ఆస్తలను నమ్మలి అంతే
  • ఆస్తుల వివరాలను ఎవరూ అడగకూడదు
  • దేేశంలోనే ఆదర్శ కుంటుంబమని  సర్టిఫికేట్ ఇచ్చేసుకుంటున్న లోకేష్

షనందమూరి సినిమాలో పాపులర్ డైలాగ్ ఒకటుంది. తాను మాట్లేడటప్పుడు ఎదుటి వారికి నోరు పనిచేయకూడదు. చెవులు మాత్రమే పనిచేయాలని. ఇపుడు నారావారి కుటుంబ ఆస్తులు ప్రకటన సందర్భంగా కూడా పై షరతులే వర్తిస్తాయి. నోరు పనిచేస్తే ఏమి జరుగుతుందో సినిమాలో బాలకృష్ణ హెచ్చరిస్తారు..ఇక్కడ చంద్రబాబు కుటుబం చెప్పదు అంతే. ఇంతకీ విషయమేమనగా ... ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు కుటుంబ ఆస్తులను ప్రజలు నమ్మాలంతే. ఎందుకంటే ఆస్తుల వివరాలను ప్రకటించింది మరి నారా వారి చిన్నబాబు కదా.

 గడచిన ఏడెళ్ళ నుండి నారావారి కుటుంబం ప్రకటిస్తున్న ఆస్తుల వివరాలు ఇదే విధంగా ఉంటున్నాయి. ఆస్తుల్లో పెద్దగా పెరుగుదల ఉండదు అయిన ఎవరికీ ఎటువంటి అనుమానాలు రాకూడదు.నారా వారి చిన్నబాబు ప్రకటించిన ఆస్తుల నిజ్జంగా నిజమేనని నమ్మాల్సిందే. వారు స్వయంగా ప్రకటించిన ఆస్తుల విలువపైన కూడా రాష్ట్రంలో ఎటువంటి చర్చా జరగకూడదని నారావారి కుటుంబంతో పాటు తెలుగుదేశం వర్గాలు కూడా భావిస్తుంటాయి.

   కాకపోతే మనది ప్రజాస్వామ్యం కాబట్టి చర్చలు, సెటైర్లు తప్పవు. దాంతో నారావారి కుటుంబ ఆస్తులపై కామెంట్ చేసేవారిపై టిడిపి నేతలు విరుచుకుపడుతుంటారు. ఇది కూడా రివాజుగా సాగుతున్నదే. చంద్రబాబు రాజకీయ జీవితం ప్రారంభించకముందు ఆయనకు ఉన్న ఆస్తి రెండెకరాలేనని ఎప్పటి నుండో ప్రచారలో ఉంది. మొదటిసారి ఎంఎల్ఏ, మొదటిసారి మంత్రి అయిన తర్వాత నుండి టిడిపి వ్యవస్ధాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్ టి ఆర్ అల్లుడు అయ్యేంత వరకూ చంద్రబాబు ఆస్తులు పెద్దగా ఏమీ లేవని ఆయన్ను బాగా తెలిసిన వారు చెబుతూనే ఉంటారు.

ఎప్పుడైతే, చంద్రబాబు ఎన్ టి ఆర్ అల్లుడయ్యారో అప్పటి నుండే ఆయన ఆస్తుల్లో పెరుగుదల ఒక్కసారిగా మొదలైందని కూడా ప్రచారంలో ఉంది. ఇక, తానే ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి ఆస్తుల గ్రాఫ్ లో పెరుగుదల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదని టిడిపి నుండి బయటకు వచ్చేసిన తమ్ముళ్ళే ఆఫ్ ది రికార్డు గా చెబుతుంటారు.

     నిజానికి ఉద్యోగులు, వ్యాపారస్తులతో పాటు పలు వృత్తుల్లో ఉన్న వారెవరూ తమ ఆస్తులు ఇదీ అని నిర్దిష్టంగా చూపుతారని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా తమ వాస్తవ ఆస్తులను ప్రకటించరన్న విషయం చిన్న పిల్లలను అడిగినా చెబుతారు. మరి, చంద్రబాబు కుటుంబం చూపుతున్న ఆస్తులు వాస్తవమేనని ఎవరూ నమ్మేవారు లేరు. ఎందుకంటే, వారు చూపుతున్న ఆస్తుల విలువకు, వాస్తవంగా ఆస్తుల విలువకు ఎన్నో రెట్లు వ్యత్యాసం ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే.

 చంద్రబాబు ఎప్పడో 40 ఏళ్ళ క్రితం కొన్న ఆస్తుల విలువనే ఇపుడు కూడా చూపుతుండటం విశేషం. ప్రతీసారీ లోకేష్ ప్రకటించిన ఆస్తుల్లో వాళ్ళ నానమ్మ తనకు బహుమతిగా ఇచ్చిన ఆస్తులను చూపుతుంటారు.   అయితే, ఈసారి విచిత్రమేమిటంటే,  లోకేష్ కుమారుడు దేవాన్ష్ పేరిట కూడా ఆస్తులను చూపిస్తూ సదరు ఆస్తులను నానమ్మ భువనేశ్వరి బహుమతిగా ఇచ్చనట్లు చూపటం. ఇంతకీ దేవాన్ష్ వయస సుమారు రెండేళ్ళు కూడా ఉంటాయో ఉండవో.

పోయినేడాది భువనేశ్వరి జూబ్లిహిల్స్ లోని 1191 చదరపు గజాల స్ధలం, దాన్లో 19,500 చదరపు అడుగుల భవనం కలిపి రూ. 9 కోట్లకు కొన్నట్లు చూపటం గమనార్హం. ఇటువంటి వివరాలను చూసినపుడే జనాలకు నారావారి ఆస్తుల ప్రకటనపై అనుమానాలు వస్తుంటాయి. తమ ఆస్తుల ప్రకటనను ఎంతమంది నమ్ముతారో నారావారి కుటుంబానికి బాగా తెలుసు. మరి తెలిసీ అసలు వారిని ఆస్తులను ప్రకటించమని డిమాండ్ చేసినదెవరబ్బా? ప్రతీ ఏడాది ఇదో ప్రహసనం కాకపోతే..

 

click me!