అమ్మాయిలు అబ్బాయిల్లో ఏం చూసి ఇష్టపడతారని చాలామంది అబ్బాయిలకి డౌట్ ఉంటుంది. లుక్స్ చూసి, కండలు చూసి ఇష్టపడతారు అని అనుకుంటారు. కానీ ఇవేవీ అమ్మాయిలను అంతగా ఆకర్షించవని వాళ్లకు తెలీదు.
అబ్బాయిల్లో అమ్మాయిలను ఆకర్షించే విషయాలు: అమ్మాయిలను అబ్బాయిల్లో ఏవి ఆకర్షిస్తాయి? చాలామంది అమ్మాయిలకు మంచి బాడీ, యాబ్స్, పొడవు ఉంటే ఇష్టమని అనుకుంటారు. కానీ నిజం దీనికి పూర్తి వ్యతిరేకం. అమ్మాయిలు బయటి రూపం కంటే కొన్ని ప్రత్యేక లక్షణాలకే పడిపోతారు. అమ్మాయిలకు ఎలాంటి అబ్బాయిలు ఇష్టమో, వాళ్లలో ఉండే 8 మంచి విషయాలేంటో చూద్దాం.
ఆఫీస్ అయినా, కాలేజ్ అయినా ఆత్మవిశ్వాసంగా ఉండే అబ్బాయిలంటే అమ్మాయిలకు చాలా ఇష్టం. ఎలాంటి పరిస్థితినైనా ధైర్యంగా, నమ్మకంగా హ్యాండిల్ చేస్తే అమ్మాయిలు బాగా ఇష్టపడతారు.
ఫ్రెండ్స్ మీటింగ్ అయినా, ఆఫీస్ మీటింగ్ అయినా, ఇంట్లో టెన్షన్ వాతావరణం ఉన్నా.. ఒక అబ్బాయి తన సెన్స్ ఆఫ్ హ్యూమర్‌తో నవ్విస్తే అమ్మాయిలు బాగా ఇష్టపడతారు. అలాంటి అబ్బాయిలతో అమ్మాయిలు చాలా కంఫర్ట్‌గా ఫీలవుతారు. సెన్స్ ఆఫ్ హ్యూమర్ రిలేషన్‌షిప్‌ను స్ట్రాంగ్ చేస్తుంది.
అమ్మాయిల ఫీలింగ్స్‌ను అర్థం చేసుకునే, కేర్ చేసే అబ్బాయిలంటే అమ్మాయిలకు ఇష్టం. ఒక అమ్మాయి ఫీలింగ్స్ అర్థం చేసుకుని సపోర్ట్ చేస్తే అది చాలా గొప్ప విషయం.
ఒక అమ్మాయి అబ్బాయిని తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ చూస్తే ఫిదా అయిపోతుంది. మెచ్యూరిటీ, తెలివితేటలు ఉంటే అమ్మాయిలు బాగా ఇంప్రెస్ అవుతారు.
ఖరీదైన దుస్తులు వేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ డ్రెస్సింగ్ సెన్స్ బాగుండి, నీట్‌గా ఉంటే అమ్మాయిలు బాగా అట్రాక్ట్ అవుతారు. శుభ్రంగా, స్టైలిష్‌గా ఉండే అబ్బాయిలంటే అమ్మాయిలకు చాలా ఇష్టం.
అమ్మాయిలను గౌరవించే, నిజాయితీగా ఉండే అబ్బాయిలంటే అమ్మాయిలకు చాలా ఇష్టం. మీ పార్టనర్‌ను గౌరవిస్తూ, నిజాయితీగా ఉంటే మీ రిలేషన్‌షిప్ చాలాకాలం స్ట్రాంగ్‌గా ఉంటుంది.
మంచిగా మాట్లాడే, తెలివైన అబ్బాయిలంటే అమ్మాయిలు వెంటనే అట్రాక్ట్ అవుతారు. ఏదైనా విషయం గురించి బాగా మాట్లాడగలిగితే, మాటలతో ఇంప్రెస్ చేస్తే అది మీకు ప్లస్ పాయింట్.
వాగ్దానాలు నిలబెట్టుకునే, నమ్మకంగా ఉండే అబ్బాయిలంటే అమ్మాయిలకు చాలా ఇష్టం. బాధ్యతగా ఉండే అబ్బాయిలంటే అమ్మాయిలకు చాలా ఇష్టం. ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే వారిని అమ్మాయిలు ఇష్టపడతారు.